Oppenheimer : ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‍హైమర్’ ఆస్కార్ 2024 అవార్డులతో అదరగొట్టింది.ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ నటుడు సహా మొత్తంగా ఈ మూవీ ఏడు ఆస్కార్ అవార్డులు దక్కించుకుంది.మాస్టర్ మైండ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది జూలైలో థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ హిట్ అయింది. అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్‍హైమర్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్ మూవీ తెరకెక్కింది.. ఇప్పుడు, ఈ ఓపెన్‍హైమర్ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.ఈనెల జరిగిన ఆస్కార్ వేడుకలో ఓపెన్‍హైమర్ చిత్రం ఏడు అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాపై మరోసారి అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ తరుణంలో మార్చి 21వ తేదీన ‘జియోసినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది.
అయితే, ముందుగా ఈ సినిమా ఇంగ్లిష్ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది.. అయితే, నేడు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ మరియు మరాఠీ భాషల వెర్షన్‍లలో కూడా ఈ చిత్రం జియోసినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.ఒరిజినల్ ఇంగ్లిష్ సహా హిందీ, తెలుగుతో పాటు మరో 5 భారతీయ భాషల్లో ఓపెన్‍హైమర్ మూవీ జియోసినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది..ఓపెన్‍హైమర్ చిత్రం సినిమాటిక్ అద్భుతమని డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్‍పై మరోసారి ప్రశంసలు వచ్చాయి. ది ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ జే రాబర్ట్ ఓపెన్‍హైమర్ అనే బుక్ ఆధారంగా ఈ మూవీని తెరక్కించారు. ఈ చిత్రంలో రాబర్ట్ ఓపెన్‍హైమర్ పాత్రను కిల్లాన్ మర్ఫీ పోషించారు. అణుబాంబు సృష్టికర్త జీవితకథను ఈ చిత్రంలో చూపించారు. ఈ మూవీలో ఎమిలీ బ్లంట్, మాయ్ డామోన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్ మరియు జోస్ హార్ట్‌నెట్ కీలకపాత్రలు పోషించారు.. సుమారు 100 మిలియన్ డాలర్లతో తెరకెక్కించిన ఈ చిత్రానికి సుమారు 964 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసింది..
Also Read
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
- Putin: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
- PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
తాజావార్తలు
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
-
Harish Rao : 1000 రోజులు.. హామీలు ఎక్కడ? హరీశ్ రావు బిగ్ కౌంటర్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!