NTV Telugu Site icon

Oscar Awards 2024: ఉత్తమ చిత్రం ‘ఓపెన్‌హైమర్‌’.. ఉత్తమ నటి ‘ఎమ్మా స్టోన్‌’! విజేతల పూర్తి జాబితా ఇదే

Cillian Murphy, Emma Stone

Cillian Murphy, Emma Stone

Oppenheimer wins seven awards in Oscars 2024: ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ వేడుకకు ఎందరో సినీ తారలు హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ థ్రిల్లర్‌ ‘ఓపెన్‌హైమర్‌’కు అవార్డుల పంట పండింది. 13 నామినేషన్‌లతో వెళ్లిన ఓపెన్‌హైమర్‌.. 7 అవార్డులను సొంతం చేసుకుంది.

ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడితో సహా పలు అవార్డులను ఓపెన్‌హైమర్‌ సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు అవార్డు కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌) సొంతం చేసుకోగా .. ఉత్తమ నటి అవార్డును ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) కైవసం చేసుకున్నారు. ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌హైమర్‌), ఉత్తమ సహాయ నటి డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌), ఉత్తమ సినిమాటోగ్రఫీ ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ), బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)కి దక్కాయి.

Also Read: IPL 2024: జేసన్‌ రాయ్‌ ఔట్.. కేకేఆర్‌లోకి విధ్వంసకర ఆటగాడు!

విజేతల పూర్తి జాబితా (Oscar Awards 2024 Full List):
ఉత్తమ చిత్రం – ఓపెన్ హైమర్
ఉత్తమ నటుడు – కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటుడు – రాబర్డ్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటి – డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ)
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ – వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)
బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌– 20 డేస్ ఇన్ మరియూపోల్
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే– కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే – జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)
బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ – ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ – ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌
బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ – ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్‌న్)
బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ – గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా)
బెస్ట్‌ ఫిలిం ఎడిటింగ్‌ – ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్)
బెస్ట్‌ సౌండ్‌ – ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ – జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌స్టైలింగ్‌ – నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం-ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం- వార్ ఈజ్ ఓవర్
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం- ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్)