Site icon NTV Telugu

Orry Drug Case: రూ.252 కోట్లు డ్రగ్స్ కేసులో ఓర్రీకి ముంబై పోలీసుల నోటీసులు

Orry Drug Case

Orry Drug Case

బాలీవుడ్‌లో ‘ఇన్‌ఫ్లుయెన్సర్ స్టార్’గా పేరు తెచ్చుకున్న ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓర్రీ, ఫ్యాషన్ స్టేట్మెంట్స్, ఫన్నీ , సెలబ్రిటీ పార్టీలలో హాజరయ్యే స్టైల్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతాడు. కానీ వివాదాలు కూడా అతడి వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా అతడి పేరు భారీ మాదకద్రవ్యాల కేసులో వెలుగులోకి రావడంతో పెద్ద సంచలనం రేగింది. హిందీ మీడియా నివేదికల ప్రకారం, రూ.252 కోట్ల విలువైన డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు ఓర్రీకి సమన్లు జారీ చేశారు. ఈ మేరకు ఎఎన్‌ఐ కూడా వార్తను ధృవీకరించింది. ఓర్రీ యాంటీ-నార్కోటిక్స్ సెల్ (ANC) ఘట్కోపర్ యూనిట్ ముందు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Also Read : Deepika Padukone: ఆ తప్పులు గుర్తొస్తే ఇప్పటికి బాధేస్తుంది.. దీపిక ఎమోషనల్ కామెంట్స్

విచారణ పత్రాలలో ఓర్రీ పేరు కనిపించినప్పటికీ, అతని పాత్ర ఏమిటన్నది ఇంకా స్పష్టత లేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఓర్రీ పేరు ఈ కేసులో ఎలా, ఎందుకు బయటపడిందన్న విషయంలో బీ-టౌన్‌లో పెద్ద చర్చ జరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఇటీవల UAE నుండి వచ్చిన సలీం డోలా కుమారుడు తాహెర్ డోలా విచారణలో, ఓర్రీ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది.

సలీం డోలా భారతదేశంతో పాటు విదేశాల్లో జరిగే సెలబ్రిటీ పార్టీలలో మాదకద్రవ్యాలు వినియోగించే నెట్‌వర్క్‌లో భాగమని పలు వార్తలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఓర్రీ ముంబై పోలీసుల విచారణ ముందు హాజరవుతాడా? అతని పాత్ర ఎంతవరకు ఉంది? వంటి విషయాలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈ కేసు నేపథ్యంలో ఓర్రీ పేరు బయటపడటమే బాలీవుడ్ వర్గాల్లో పెద్ద షాక్‌గా మారింది.

Exit mobile version