NTV Telugu Site icon

Blink It: ‘బ్లింకిట్’కే మైండ్ బ్లాక్ అయ్యే ఆర్డర్ ఇచ్చిన బెంగుళూరు వాసి

Blink It

Blink It

Blink It: ప్రజలు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. యువత కొత్తేడాది వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యాపారస్తులకు డిసెంబర్ 31 ఓ రకంగా పండుగే అని చెప్పుకోవాలి. బిజినెస్ బాగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ కామర్స్ బిజినెస్ బాగా పుంజుకొంది. ఫుడ్, గ్రాసరీ ఆర్డర్లు బాగా పెరిగినట్లు ఈ కామర్స్ సంస్థలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే బ్లింకిట్ సంస్థకు న్యూ ఇయర్ సందర్భంగా బెంగుళూరుకు చెందిన ఒక కస్టమర్ రూ.28,962 విలువైన ఆర్డర్ ఇచ్చారని యాప్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండా ట్విట్టర్‌లో ప్రకటించారు.

Read Also: Bomb Blast: కాబూల్ లో భారీ పేలుడు.. 14మంది మృతి

ఈ ఆర్డర్‌లో చాలా వరకు చిప్స్, టానిక్ వాటర్, బోట్ స్పీకర్లు ఉన్నట్లు ఉన్నాయని ధిండా తెలియజేశారు. ఆ ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి ఇద్దరు డెలివరీ సిబ్బంది అవసరమైనట్లు ఆయన పేర్కొన్నారు. అతను ఆన్‌లైన్ కిరాణా ప్లాట్‌ఫారమ్‌లో ఆర్డర్‌ల సంఖ్య, స్వభావం గురించి నిరంతరం ట్వీట్ చేస్తూనే ఉన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం చలికాలం అయినప్పటికీ నేడు ఢిల్లీలో ప్రతి మూడు ఆర్డర్‌లలో ఒకటి బ్లింకిట్‌లో కూల్ డ్రింక్ ఆర్డర్ ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రతి సెకనుకు 41 ప్యాకెట్ల చిప్స్ కు ఆర్డర్లు వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డిసెంబర్ 31 ఒక్క రోజే 1.5 లక్షలకు పైగా నిమ్మకాయలు డెలివరీ అయినట్లు అధికారులు తెలియజేశారు. నూతన సంవత్సర పండుగ సందర్భంగా దాదాపు 560 మంది విచిత్రంగా పొట్లకాయను ఆర్డర్ చేశారని తెలిపారు.