NTV Telugu Site icon

OPPO Reno 12: మార్కెట్ లోకి వచ్చేస్తున్న Reno 12 సిరీస్.. వివరాలు ఇలా..

Oppo Reno 12

Oppo Reno 12

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ కంపెనీ ఒప్పో నుంచి ‘Reno 12 సిరీస్’ లాంచ్ అవుతుంది. ఈ లైనప్ లో ఒప్పో Reno 12, ఒప్పో Reno 12 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. మే 23న ఈ సిరీస్ ను చైనాలో లాంచ్ చేయననున్నారు కంపెనీ సభ్యులు. ఇందుకు సంబంధించి తాజాగా ఒప్పో కంపెనీ ఓ కొత్త టీజర్‌ని విడుదల చేసింది. దీని వల్ల రెనో 12 యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. ఇక ఈ ఫోన్స్ వివరాలను ఓసారి తెలుసుకుందాం.

Shah Rukh Khan: డీహైడ్రేషన్ కారణంగా ఆసుపత్రి పాలైన బాలీవుడ్ బాద్ షా..

ఒప్పో రెనో 12 సిరీస్ ఫోన్లు గ్లాసీ ఫినిష్ తో రాబోతున్నట్లు రివీలైన ఇమేజెస్ ద్వారా అర్థమవుతుంది. ఫోన్ వెనుక ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ లు ఉన్నాయి. ఈ మోడల్ లో రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో 3 కెమెరా సెన్సర్స్లు ఉన్నాయి. ఏఐ కెమెరా సిస్టమ్ అని మాడ్యూల్ పై రాసి ఉండడం గమనించవచ్చు. ఇక ఈ ఫోన్స్ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే., టీజర్ ద్వారా సిల్వర్, పర్పుల్ కలర్స్ రివీల్ అయ్యాయి. ఇక డివైజ్‌ని గమనిస్తే, కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్ ఉండగా., బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో ఒప్పో బ్రాండింగ్ కనపడుతుంది.

ఒప్పో Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ చూస్తే.. డిస్ప్లే పరంగా ఒప్పో Reno 12 సిరీస్ ఫోన్లు 6.7 ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటాయి. అలాగే ప్రాసెసర్ పరంగా ఒప్పో Reno 12 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8250 చిప్సెట్ కలిగి ఉంది. ఒప్పో Reno 12 Pro లో డైమెన్సిటీ 9200 స్టార్ స్పీడ్ ఎడిషన్ ఉంటుంది. ఇక వీటిలో 12జిబి లేదా 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి లేదా 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ స్టోరేజీ ఉంటాయి.

Manam Re-Release : “మనం” మాకెంతో స్పెషల్ మూవీ..నాగార్జున స్పెషల్ వీడియో వైరల్..

ఒప్పో Reno 12 సిరీస్ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50mp సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరా, 8mp అల్ట్రావైడ్ లెన్స్, 50mp 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉంటాయని తెలుస్తోంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50mp ఫ్రంట్ కెమెరా ఉంటుందని సమాచారం. ఇక వీటిలో 5000mah బ్యాటరీ, 80W సూపర్‌ వూక్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నాయి. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది. ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది.