Site icon NTV Telugu

Operation Kagar: నేటితో ముగుస్తున్న ‘కగార్’ డెడ్‌లైన్.. మావో శకం ముగిసినట్లేనా?

Operation Kagar

Operation Kagar

నేటితో దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన ‘కగార్’ ఆపరేషన్ కార్యక్రమం ముగుస్తోంది. మార్చి 31, 2026 నాటికి దేశాన్ని మావో రహిత దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటికే కగార్ ఆపరేషన్ ద్వారా ఆయా రాష్ట్రాల్లో అడవుల్లో తిష్టవేసిన మావోలను భద్రతా దళాలు ఏరివేశాయి. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఇంకొన్ని గంటల్లో లొంగిపోవాల్సి ఉంటుంది. లేదంటే భద్రతా దళాలు అంతమొందించే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ

సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. దేశంలో మావోయిజం అంతం అయిందని ప్రకటించారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీని నిర్మూలించినట్లుగా వెల్లడించారు. చర్చలతోనే పరిష్కారమని.. ఆయుధాలు చేపట్టే యోచన సరికాదని సూచించారు. నక్సల్స్‌ హింసలో 5 వేల మంది భద్రతా సిబ్బంది సహా 20వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని.. దీనికంతటికీ 60 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ పాలనే కారణంగా అమిత్ షా ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Opinion Polls Survey: బెంగాల్‌పై తాజా సర్వే వచ్చేసింది.. ఈసారి గెలవబోయేది ఎవరంటే..!

మంగళవారంతో మావోల కోసం కేంద్రం విధించిన గడువైతే ముగుస్తుంది. ఇప్పటికే దండకారణ్యం మొత్తం ఖాళీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ జాడలేవీ కనిపించడం లేదు. అడువులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దాదాపుగా మావోలంతా సరెండర్ అయినట్లుగా తెలుస్తోంది. పలువురు కీలక నేతలు మాత్రం విదేశాలకు పారిపోయినట్లుగా సమాచారం. ఏదేమైతే మొత్తానికి నేటితో మావో శకం ముగిసినట్లుగానే చెప్పొచ్చు.

Exit mobile version