NTV Telugu Site icon

Operation Ajay: 212మంది విద్యార్థులతో ఇజ్రాయెల్ నుండి ఢిల్లీకి చేరుకున్న తొలి విమానం.. ఇంకా 20 వేల మంది

Ois

Ois

Operation Ajay: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో అనేక దేశాల పౌరులు కూడా మరణించారు. వీటన్నింటి మధ్య, ఇజ్రాయెల్ నుండి తన పౌరులు సురక్షితంగా తిరిగి రావడానికి భారతదేశం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ నుండి 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ ఈ ఉదయం AI1140 విమానంలో న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఇజ్రాయెల్ నుండి తమ దేశానికి తిరిగి వచ్చిన ప్రయాణీకులకు స్వాగతం పలికేందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ యుద్ధంలో దేశం విడిచి వెళ్లాలనుకునే 212 మంది భారతీయులతో కూడిన మొదటి చార్టర్ విమానం గురువారం బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరింది.

Read Also:Samsung Mobile : శాంసంగ్ నుంచి మరో రెండు ట్యాబ్లెట్లు.. ఫీచర్స్, ధర?

ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘తమ ప్రభుత్వం ఏ భారతీయుడిని వదిలిపెట్టదని అన్నారు. మన ప్రభుత్వం, మన ప్రధానమంత్రి వారిని రక్షించి, సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నారు. మా పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చినందుకు విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్.. అతని బృందానికి మేము కృతజ్ఞతలు’ తెలిపారు. అవసరమైతే వైమానిక దళాన్ని కూడా ఉపయోగించుకుంటామని, ప్రస్తుతానికి చార్టర్ విమానాలను ఉపయోగిస్తున్నామని.. ఈ ఉదయం 212 మందిని వెనక్కి తీసుకువస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న మన భారతీయ పౌరులు త్వరలో రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 18000 మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో ఉన్నారు. అందులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు భారతీయులెవరూ గాయపడినట్లు సమాచారం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read Also:Nayanthara : సమంత కు స్పెషల్ గిఫ్ట్ పంపిన నయన్..

ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 222 మంది సైనికులతో సహా 1300 మందికి పైగా మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 1973లో ఈజిప్ట్, సిరియాతో వారాలపాటు జరిగిన యుద్ధం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు కనిపించలేదు. హమాస్ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్‌లో మహిళలు,పిల్లలతో సహా కనీసం 1,417 మంది మరణించారు.