యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’..ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం విడుదలకు ముందు మూవీ టీమ్ ప్రమోషన్లను జోరుగా చేయడంతో ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొంది.ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజయింది. పాజిటివ్ మౌత్ టాక్‍తో ఈ చిత్రానికి ఆరంభంలో మంచి వసూళ్లు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అనుకున్న స్థాయిలో జోరు చూపలేకపోయింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మార్చి 15వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానున్నట్లు తెలుస్తుంది.అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు, ఆహాలో కూడా ఈ చిత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.
ఊరు పేరు భైరవకోన చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఫ్యాంటసీతో పాటు హారర్ ఎలిమెంట్‍ను కూడా ఈ చిత్రంలో చూపించారు. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్‍లు గా నటించారు., వెన్నెల కిశోర్, వైవా హర్ష మరియు రవిశంకర్ కీలకపాత్రలు చేశారు.ఊరు పేరు భైరవకోన సినిమాకు ఇప్పటి వరకు సుమారు ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. తొలి వారం ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. పోటీగా వేరే చిత్రాలు లేకపోవటంతో ఈ మూవీకి కలిసి వచ్చింది. అయితే, ఆ తర్వాత ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో వసూళ్ల జోరు కొనసాగలేదు. అయితే, ఓవరాల్‍గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకుంది.ఊరు పేరు భైరవకోన మూవీని హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మించగా.. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ అందించారు.
