NTV Telugu Site icon

Hands Job: కేవలం చేతులనే చూపిస్తూ నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఎక్కడ ఎలా అంటే..

Hand Jobs

Hand Jobs

ప్రతి ఒక్కరూ ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. ఈ క్రమంలో డబ్బు సంపాదించడం సులువు అని కొందరంటే.. మరికొందరు చాలా కష్టమని అంటున్నారు. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు అనుభవాలను బట్టి వారి సంపాదన ఉంటుంది. కానీ సులువుగా డబ్బు సంపాదించే వ్యక్తులను మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అయితే కొంతమంది డబ్బు ఎలా సంపాదిస్తున్నారో చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ మధ్య కాలంలో మహిళలు కేవలం తమ చేతిని పెట్టుబడిగా పెట్టి చాలా డబ్బు సంపాదిస్తున్నారు. కేవలం చేతులు చూపి నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. మరి., ఈ మహిళ ఎవరు మరియు ఆమె జీవనోపాధి కోసం ఏమి చేస్తుంది..? ఆ వివరాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

Also read: T20 World Cup: టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ ఉండాల్సిందే..! తేల్చిచెప్పిన కెప్టెన్

ఒక మహిళ తనదైన శైలితో చాలా డబ్బు సంపాదించడం వల్ల ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కేవలం చేతులు చూపించి ఊహకందని ఆదాయాన్ని సంపాదిస్తుంది. అమెరికాకు చెందిన అలెగ్జాండ్రా బెరోకల్ అనే మహిళ వృత్తిరీత్యా “హ్యాండ్ మోడల్”. ఇది కేవలం చేయి చూపడం మాత్రమే. ఆమె చేతి మోడల్ కావడంతో ముఖం, శరీరం చూపకుండా చేతులు చూపిస్తూ డబ్బు సంపాదిస్తుంది. అలెగ్జాండ్రా అమెరికాలోని న్యూయార్క్‌లో తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఆమె విభిన్న రీతుల్లో తన చేతిని చూపించడం ద్వారా ఆమె సంపాదన చేస్తుంది. ఈ వీడియోలకు సంబంధించి వీక్షణల సంఖ్య ఆధారంగా ఆమెకి డబ్బు వస్తుంది. అంతేకాదు వీడియో తీస్తున్నప్పుడు ముఖం కూడా చూపించాల్సిన అవసరం లేదు. ఓసారి అలెగ్జాండ్రా తన సంపాదన గురించి తన స్నేహితులకు చెప్పినప్పుడు, వారు కూడా షాక్ అయ్యారు. కేవలం చేతివాటం చూపి రూ. కోటిన్నర సంపాదిస్తామంటే నమ్మలేకపోయారు.

Also read: Aa Okkati Adakku: పెళ్లి కాని వాళ్ళ పెయిన్ ఫీలయ్యి సినిమా చేశా.. డైరెక్టర్ ఇంటర్వ్యూ

2019లో మోడల్‌ గా పనిచేయడం ప్రారంభించానని అలెగ్జాండ్రా తెలిపింది.ఈ విషయంలో అతను చాలా బ్రాండ్లు, సెలబ్రిటీలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పబడింది. ఆమె బ్రాండన్ బ్లాక్‌వుడ్, కేస్ నైల్స్, సెరెనా విలియమ్స్ జ్యువెలరీ వంటి బ్రాండ్‌ లతో కలిసి పనిచేసింది. ఈ బ్రాండ్‌ ల ఉత్పత్తులను మాన్యువల్‌ గా మోడల్ చేయడానికి కంపెనీలు ఆమెకి చెల్లిస్తాయి. ఆమె 40 నిమిషాల షూట్‌ కి 750 డాలర్స్, 5 గంటల షూట్‌కి 1,200 డాలర్స్ సంపాదిస్తుంది. దాంతో ఆమె తన చేతిని చూపిస్తూ సంవత్సరానికి 30,000 డాలర్స్ సంపాదిస్తుంది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 25 లక్షల రూపాయలు. ఈ విధంగా లెక్కించినట్లయితే, ఆమె నెలవారీ ఆదాయం 2,00,000 రూపాయలు. మరి., తన చేతులను మాత్రమే వినియోగించి భారీ ఆదాయాన్ని ఆర్జించే ఈ మహిళ గురించి మీరేమంటారో ఓ కామెంట్ చేసేయండి.