బ్యాంక్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 400 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ 2021, 2025 మధ్య పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు.
Also Read:Nandyal Tragedy: ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసులు మృతి
అయితే, రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. డిసెంబర్ 1, 2025 నాటికి వయస్సు లెక్కిస్తారు. జనరల్, OBC, EWS కేటగిరీల అభ్యర్థులు రూ.800, SC/ST అభ్యర్థులు రూ.600, అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులు రూ.600 డిపాజిట్ చేయాలి. PH అభ్యర్థులకు ఫీజు రూ.400. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 25న ప్రారంభమైంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 10, 2026. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
