Onion Price: కంటతడి పెట్టిస్తోన్న ఉల్లి.. కిలో ఎంతకు అమ్ముడవుతుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Price: దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగిపోవడంతో సామాన్యుల పరిస్థితి దారుణంగా మారింది. టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఉల్లి ధర ప్రజలను కంటతడిపెట్టించేందుకు రెడీ అవుతోంది. ఈ నెలాఖరు నాటికి రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతాయని.. వచ్చే నెలలో కిలో రూ.60-70కి చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అక్టోబరు నుంచి ఖరీఫ్ రాక ప్రారంభం కాగానే ఉల్లి సరఫరా మెరుగ్గా ఉంటుందని.. దీంతో ధరలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు.
క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. డిమాండు-సరఫరా అసమతుల్యత ప్రభావం ఆగస్టు చివరి నాటికి ఉల్లి ధరలపై కనిపించవచ్చని అంచనా. సెప్టెంబరు ప్రారంభం నుంచి రిటైల్ మార్కెట్ లో ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, కిలో రూ.60-70 వరకు చేరవచ్చని గ్రౌండ్ లెవల్ చర్చల ద్వారా అందిన సమాచారం. అయితే ధర మాత్రం 2020లో ఉన్న గరిష్ట స్థాయి కంటే తక్కువగానే ఉంటుంది.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Read Also:Covid-19 EG.5.1: వేగంగా వ్యాప్తి చెందుతోన్న కొవిడ్-19 కొత్త వేరియంట్!
ఉల్లి ధర ఎప్పుడు తగ్గుతుంది?
ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో రబీ ఉల్లి తక్కువ నిల్వ, వినియోగ వ్యవధి ఒకటి-రెండు నెలలు.. భయాందోళనల కారణంగా బహిరంగ మార్కెట్లో రబీ నిల్వలు సెప్టెంబర్‌కు బదులుగా ఆగస్టు చివరి నాటికి గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీంతో ఉల్లి వినియోగం పెరుగుతుందని.. అక్టోబరు నుంచి ఖరీఫ్ రాక ప్రారంభం కాగానే ఉల్లి సరఫరా మెరుగ్గా ఉంటుందని, ఈ కారణంగా ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. పండుగ నెలల్లో (అక్టోబర్-డిసెంబర్) ధరల్లో హెచ్చుతగ్గులు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి-మే మధ్య కాలంలో ఉల్లి ధరలు పతనం కావడం వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది. అయితే ఇది ఖరీఫ్ సీజన్లో విత్తడానికి ఉల్లి రైతులను నిరుత్సాహపరిచింది. ఈ ఏడాది విస్తీర్ణం ఎనిమిది శాతం తగ్గుతుందని, ఖరీఫ్ ఉల్లి ఉత్పత్తి ఏడాదికి ఐదు శాతం తక్కువగా ఉంటుందని అంచనా. వార్షిక ఉత్పత్తి 29 మిలియన్ టన్నులు ఉంటుందని అంచనా. ఇది గత ఐదేళ్ల (2018-22) సగటు ఉత్పత్తి కంటే ఏడు శాతం ఎక్కువ. ఖరీఫ్, రబీ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం సరఫరాలో పెద్దగా కొరత ఏర్పడే అవకాశం లేదు. ఆగస్టు, సెప్టెంబరులో వర్షాలు ఉల్లి పంట.. దాని పెరుగుదలను నిర్ణయిస్తాయి.
Read Also:Tomato: భారీగా పడిపోయిన టమాటా ధరలు.. కిలోకు రూ.50తగ్గుదల
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!