Oneplus Nord CE4 Price Drop in Amazon: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ముఖ్యంగా ‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ4’ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు బ్యాంకు ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో నార్డ్ సీఈ4ను తక్కువ ధరకే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఆ డీటెయిల్స్ ఈసారి తెలుసుకుందాం.
అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ అసలు ధర రూ.24,999గా ఉంది. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో 6శాతం తగ్గింపు లభిస్తోంది. దాంతో ఈ ఫోన్ రూ.23,499కి లబిస్తుంది. ఈ ఫోన్‌పై రూ.500 కూపన్ డిస్కౌంట్ ఉంది. ఎస్‌బీఐ బ్యాంకు కార్డుపై రూ.1500 తక్షణ తగ్గింపును పొందుతారు. దాంతో మీరు నార్డ్ సీఈ4 ఫోన్‌ను రూ.21,499కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు రూ.18,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇంతమొత్తం లభించాలంటే మీ పాత ఫోన్ లేటెస్ట్ వెర్షన్ అయుండి.. ఎలాంటి డామేజ్ లేకుండా ఉండాలి.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 స్పెసిఫికేషన్స్:
# ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ 14 ఓఎస్
# 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే
# 120Hz రిఫ్రెష్ రేటు
# స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్
# 50 ఎంపీ సోనీ LYT600 సెన్సర్
# 16 ఎంపీ కెమెరా సెల్ఫీ కెమెరా
# 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ