NTV Telugu Site icon

OnePlus Nord CE4 Lite Launch: నేడు ‘వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్’ లాంచ్.. లైవ్ స్ట్రీమింగ్, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!

Oneplus Nord Ce4 Lite

Oneplus Nord Ce4 Lite

OnePlus Nord CE4 Lite Livestream and Price in India: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్‌’ నార్డ్‌ సిరీస్‌లో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే నార్డ్‌ సీఈ 2, నార్డ్‌ సీఈ 3, నార్డ్‌ సీఈ 3 లైట్, నార్డ్‌ సీఈ 4ను రిలీజ్ చేసిన వన్‌ప్లస్‌.. ఈరోజు (జూన్ 24) ‘నార్డ్‌ సీఈ 4 లైట్‌’ను రిలీజ్ చేయనుంది. దేశంలో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు రాత్రి 7 గంటలకు లాంచ్ చేయనుంది. లాంచ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు వన్‌ప్లస్‌ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా చూడొచ్చు.

OnePlus Nord CE4 Lite Specs:
లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌కు సంబందించిన పూర్తి వివరాలను వన్‌ప్లస్‌ కంపెనీ తెలపనుంది. ధర, స్పెసిఫికేషన్స్, వేరియెంట్స్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, అమ్మకాలు.. అన్ని డీటెయిల్స్ తెలియరానున్నాయి. రిలీజ్ ముందే ఈ ఫోన్‌కు సంబందించిన కొన్ని వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 91మొబైల్స్ నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ 120Hz అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2,100 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. వన్‌ప్లస్‌ 12 వలె.. ఇందులో ఆక్వా టచ్ ఫీచర్‌ ఉంటుందట.

OnePlus Nord CE4 Lite Camera and Battry:
వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్‌ ఫోన్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో పనిచేసే 6.67 ఇంచెస్ అమోలెడ్‌ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని సంచారం. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్‌తో వస్తుంది. 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో సపోర్ట్ చేసే 5,500mAh బ్యాటరీని అందించనుంది. ఇది రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతుతో కూడా రానుంది. 52 నిమిషాల్లో 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

Also Read: Realme GT 6 Sale: రేపే ‘రియల్‌మీ జీటీ6’ అమ్మకాలు ఆరంభం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్స్!

OnePlus Nord CE4 Lite Price:
వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్‌ ధర దాదాపుగా 20 వేలు ఉంటుందని అంచనా. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 ఫోన్ భారతదేశంలో రూ. 24,999 ప్రారంభ ధరతో ప్రారంభించబడింది. ఇది గ్లోసీ బ్లూ కలర్ ఆప్షన్‌లో వచ్చే అవకాశం ఉంది. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.