OnePlus Nord CE4 Launch and Sales Details: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ తన నార్డ్ సిరీస్‌లో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. నార్డ్ సీఈ4 5జీ పేరుతో భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. నార్డ్ సీఈ 3కి కొనసాగింపుగా వన్‌ప్లస్ ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 100W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ అమ్మకాలు నేటి నుంచి షురూ కానున్నాయి. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన నార్డ్ సీఈ4 ధర, ఫీచర్ల వివరాలను తెలుసుకుందాం.
OnePlus Nord CE4 Price:
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 5జీ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా, ఇతర రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ కొనుగోలుపై వన్‌ప్లస్ నార్డ్ 2ఆర్ ఇయర్ బడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.24,999 కాగా.. 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.26,999గా ఉంది. డార్క్ క్రోమ్, సెలాడన్ మార్బుల్ రంగుల్లో నార్డ్ సీఈ4 వస్తుంది.
Also Read: RCB Title: అందుకే ఆర్‌సీబీ ఇంకా టైటిల్ గెలవలేదు: అంబటి రాయుడు
OnePlus Nord CE4 Specs:
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ 14 ఓఎస్‌పై పని చేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఇందులో ఉంది. 120Hz రిఫ్రెష్ రేటుతో ఇది వస్తోంది. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. వెనకవైపు 50 ఎంపీ సోనీ LYT600 సెన్సర్, 8 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 355 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. నార్డ్ సీఈ 4లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. ఇది 100W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 29 నిమిషాల్లో ఫుల్ బ్యాటరీని ఛార్జ్ అవుతుంది.