Site icon NTV Telugu

OnePlus Nord CE 3 Price: వన్‌ప్లస్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. నార్డ్‌ సీఈ3పై భారీ డిస్కౌంట్‌!

Oneplus Nord Ce 3

Oneplus Nord Ce 3

Price Cut on OnePlus Nord CE 3: ‘వన్‌ప్లస్‌’ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన నేపథ్యంలో నార్డ్‌ సీఈ3 ధరను తగ్గించింది. వన్‌ప్లస్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో కొత్త ధరతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3ని ఇటీవలి కాలంలో చాలా మంది కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌లకు భారత్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 స్మార్ట్‌ఫోన్‌ 2023 జులైలో విడుదల అయింది. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.26,999గా ఉంది. ఇటీవల వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4ను తీసుకొచ్చిన నేపథ్యంలో కంపెనీ సీఈ3పై రూ.4,000 తగ్గించి.. రూ.22,999కు అందుబాటులో ఉంచింది. బ్యాంకు ఆఫర్లతో ఈ రేటు మరింత తగ్గుతుంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, వన్‌కార్డ్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.2,000 రాయితీ లభిస్తుంది. అదే హెడ్‌డీఎఫ్‌సీ డెబిట్‌ కార్డు ఈఎంఐ ద్వారా రూ.2,250 డిస్కౌంట్ పొందొచ్చు. ఇక బ్లాక్, ఆక్వా గ్రీన్‌ కలర్ ప్రొటెక్టివ్‌ కేస్‌ను కంపెనీ ఉచితంగా ఇస్తోంది. ఆరు నెలల పాటు గూగుల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌, 3 నెలల వ్యాలిడిటీతో యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు.

Also Read: Nothing Earbuds: ‘నథింగ్‌’ నుంచి 2 కొత్త ఇయర్‌బడ్స్‌.. 40 గంటల బ్యాటరీ లైఫ్‌!

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3లో 120Hz రీఫ్రెష్‌ రేటుతో కూడిన అమోలెడ్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్‌ 782జీ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 13.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఇచ్చారు. ఓఐఎస్‌తో కూడిన 50 ఎంపీ ప్రధాన, 8ఎంపీ అల్ట్రావైడ్‌, 2ఎంపీ మైక్రో కెమెరా సెటప్‌ ఉండగా.. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. 80వాట్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఇందులో ఇచ్చారు. 15-20 నిమిషాల్లో పూర్తి ఛార్జ్‌ అవుతుంది. ఈ ఫోన్‌ ఆక్వా సర్జ్‌, గ్రే షిమ్మర్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

 

Exit mobile version