NTV Telugu Site icon

OnePlus Nord 4 Price: లాంచ్ ఈవెంట్‌కు ముందే ధర లీక్.. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 కంటే తక్కువ!

Oneplus Nord 4 Price

Oneplus Nord 4 Price

OnePlus Nord 4 5G Smartphone Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్‌’ నార్డ్‌ సిరీస్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నార్డ్‌ సిరీస్‌లో సీఈ 4 లైట్‌ ఫోన్‌ను విడుదల వన్‌ప్లస్‌.. మరో ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమైంది. ‘వన్‌ప్లస్‌ నార్డ్‌ 4’ను జూలై 16న భారతదేశంలో లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్‌ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లాంచ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే లాంచ్ ఈవెంట్‌కు ముందే వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ ధర లీక్ అయింది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. గత సంవత్సరం రిలీజ్ అయిన వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్ ధర కంటే తక్కువగా ఉంటుందట. వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 ప్రారంభ ధర రూ.30,999 లేదా రూ.31,999గా ఉంటుందని TechHome100 అనే ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. బ్యాంక్ కార్డ్ ఆఫర్‌ల అనంతరం ఈ ధర రూ.27,999కి తగ్గుతుందని తెలిపింది. నార్డ్‌ 4 ధర వివరాలు జూలై 16న కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది. నార్డ్‌ 3 ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ రూ.33,999.. 16జీబీ+256జీబీ వేరియంట్‌ రూ.37,999 ధరతో లాంచ్ అయింది.

Also Read: Abhishek Sharma Record: విరాట్ కోహ్లీ తర్వాత.. అభిషేక్ శర్మ చెత్త రికార్డ్!

వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్ మెటల్ యూనిబాడీ డిజైన్‌తో వస్తుందని గతంలో కంపెనీ ధృవీకరించింది. లీకైన టీజర్‌లు ఇది నిజమే అని చూపించాయి. ఈ ఫోన్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌లో రానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 SoC ప్రాసెసర్‌, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-ఇంచెస్ 1.5K అమోలెడ్‌ స్క్రీన్ ఉంటుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో లెన్స్ వెనక భాగంలో.. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ముందు భాగంలో ఉండే అవకాశం ఉంది.

Show comments