చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’.. 2025 దీపావళి సేల్‌ను ప్రకటించింది. సేల్ సెప్టెంబర్ 22న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఆరంభం కానుంది. సేల్ సమయంలో కంపెనీ ముఖ్యంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఎస్, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సిరీస్‌లో ఫోన్‌లపై రూ.12000 కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఫోన్‌లపై మాత్రమే కాదు ఆడియో ఐటమ్స్, టాబ్లెట్‌లపై కూడా భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
దీపావళి సేల్ సమయంలో వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. రూ.42999 ధరకు లాంచ్ చేయబడిన ఈ ఫోన్.. సేల్ సమయంలో రూ.35,749కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌పై రూ.5000 తగ్గింపు, రూ.2250 బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ 13ఎస్‌పై కూడా మంచి డీల్ ఉంది. రూ.54999 కు లాంచ్ అయిన ఈ ఫోన్ ఈ సేల్ సమయంలో రూ.47749కు అందుబాటులో ఉంటుంది. రూ.4000 తగ్గింపు, రూ.3250 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. 70 వేల వన్‌ప్లస్ 13ను రూ.57749కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై రూ.8000 తగ్గింపు, రూ.4250 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అంటే మొత్తంగా 12 వేలకు పైగా ఆదా చేసుకోవచ్చు.
Also Read: Surya Grahan 2025: నేడు ‘సూర్యగ్రహణం’.. సూతక్ కాలం, పరిహారాలు ఇవే!
దీపావళి సేల్ సమయంలో రూ.24,999 ధరకు లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ5 రూ.21,499 ధరకు లభిస్తుంది. ఆడియో, టాబ్లెట్ పరికరాలపై కూడా కంపెనీ డిస్కౌంట్లను అందిస్తుంది. జూలైలో ప్రారంభించబడిన వన్‌ప్లస్ బడ్స్ 4 రూ.4,799 కు అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 అసలు ధర రూ.11,999 నుంచి రూ.7999 కు అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ పాడ్ లైట్ బేస్ మోడల్ రూ.14999కు అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ పాడ్ గోను రూ.13749 కు కొనుగోలు చేయవచ్చు. ఈ దీపావళి సేల్ ఆఫర్స్ వన్‌ప్లస్ ప్రియులు అస్సలు మిస్ కావొద్దు.
