NTV Telugu Site icon

OnePlus Community Sale 2024: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 6వేల తగ్గింపు!

Oneplus 12r Offers

Oneplus 12r Offers

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ సరికొత్త సేల్‌తో ముందుకొచ్చింది. వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ సేల్‌ డిసెంబర్‌ 6 నుంచి 17 వరకు అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 12, వన్‌ప్లస్‌ 12ఆర్‌, వన్‌ప్లస్‌ నార్డ్ 4 వంటి స్మార్ట్‌ఫోన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్స్‌ అందిస్తోంది. అంతేకాదు బ్యాంక్‌ డిస్కౌంట్స్ సహా 12 నెలల వరకు నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. వన్‌ప్లస్ వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌లోనూ ఆఫర్లు అందిబాటులో ఉన్నాయి.

సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 12పై బిగ్‌ డిస్కౌంట్ ఉంది. రూ.6వేల ఫ్లాట్‌ డిస్కౌంట్ సహా.. ఐసీఐసీఐ బ్యాంక్‌, వన్‌కార్డ్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపై రూ.7వేలు డిస్కౌంట్‌ పొందొచ్చు. 12జీబీ+256జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.64,999గా ఉంది. రూ.6వేల ఫ్లాట్‌ డిస్కౌంట్ అనంతరం రూ.58,999కి అందుబాటులో ఉంది. వన్‌ప్లస్‌ 12ఆర్‌పై రూ.6 వేలు డిస్కౌంట్‌, బ్యాంకు కార్డులపై రూ.3 వేలు డిస్కౌంట్‌ అందిస్తోంది. 16జీబీ+256జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.39,999గా ఉంది.

Also Read: Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇవే!

కమ్యూనిటీ సేల్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌పై రూ.3వేల డిస్కౌంట్‌, రూ.2 వేల బ్యాంక్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4, నార్డ్‌ సీఈ4 లైట్‌ ఫోన్‌లపై రూ.2 వేలు డిస్కౌంట్‌ ఉండగా.. వెయ్యి రూపాయలు బ్యాంక్‌ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్‌ ప్యాడ్ 2, వన్‌ఫ్లస్ ప్యాడ్‌ గో, వన్‌ప్లస్‌ వాచ్‌2, వన్‌ప్లస్‌ వాచ్‌ 2ఆర్‌, వనఫ్లస్ బడ్స్‌ ప్రో 3 కూడా ఆఫర్లు ఉన్నాయి. వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి.

Show comments