OnePlus 16 Launch: వన్‌ప్లస్ (OnePlus) నుండి రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ 16 (OnePlus 16)కు సంబంధించిన కీలక వివరాలను తెలిపింది. చైనాలో ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ప్రముఖ రిటైల్ ఛానళ్లలో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కంపెనీ కొత్త ఫోన్‌లో అందించనున్న మూడు కలర్ వేరియంట్లను అధికారికంగా రివీల్ చేసింది. గేమింగ్, ప్రాసెసింగ్ సామర్థ్యాలకు సంబంధించి కూడా పలు వివరాలను కంపెనీ తెలిపింది.
మూడు కొత్త కలర్ వేరియంట్లు
వన్ ప్లస్ 16లో ప్రత్యేక ఆకర్షణగా “Tomorrow’s Starlight” కలర్ వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేసింది. వెనుక ప్యానెల్‌పై కాంతి పడే విధానాన్ని బట్టి విభిన్నంగా కనిపించేలా ఈ ఫినిష్‌ను రూపొందించారు. ఈ ఫినిష్‌లో మూడు ప్రత్యేక తయారీ టెక్నాలజీలను ఉపయోగించినట్లు కంపెనీ ప్రచార వివరాల్లో పేర్కొంది. ఇందులో Interstellar Light Effect ద్వారా వెనుక ప్యానెల్‌పై కాంతి ప్రతిబింబాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అలాగే Nano-Grating Texture కారణంగా ఫోన్‌ను వివిధ కోణాల్లో తిప్పినప్పుడు రంగుల హైలైట్స్ మారుతూ కనిపిస్తాయి.
అలాగే ” సిల్క్ గ్లాస్ ప్రాసెస్ (Silk Glass Process)” ద్వారా మ్యాట్ ఫినిష్ కలిగిన గ్లాస్‌ను ఉపయోగించారు. దీంతో ఫోన్‌పై వేలిముద్రలు, మరకలు తక్కువగా కనిపించడంతో పాటు చేతిలో పట్టుకున్నప్పుడు స్మూత్‌గా ఉండేలా డిజైన్ చేశారు. Tomorrow’s Starlightతో పాటు మరో రెండు కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి డార్క్ ఫినిష్‌తో హై-కాంట్రాస్ట్ యాక్సెంట్స్‌ను కలిగి ఉండగా.. మరొక వేరియంట్ డీప్ రెడ్, టెర్రాకోటా టోన్స్‌తో ప్రత్యేక థీమ్‌లో రూపొందించారు.
180 FPS వరకు గేమింగ్?
ఈ మొబైల్ పనితీరుకు సంబంధించి కూడా ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ “డిజిటల్ చాట్ స్టేషన్” ప్రకారం.. ఈ ఫోన్‌లో “Windspeed Gaming Kernel” అనే ప్రత్యేక గేమింగ్ కర్నల్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. Qualcommతో కలిసి దీనిని అభివృద్ధి చేసింది. ఈ ఫోన్‌లో రానున్న Qualcomm SM8975 ప్లాట్‌ఫామ్ ఆధారిత హార్డ్‌వేర్‌ను ఉపయోగించనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. గేమింగ్ కోసం కస్టమ్ డ్రైవర్-లెవల్ ఆప్టిమైజేషన్లు, మొబైల్ రీకన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
ముఖ్యంగా Genshin Impact వంటి భారీ గేమ్స్‌లో 180 FPS వరకు హై ఫ్రేమ్‌రేట్ గేమింగ్‌ను టార్గెట్ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇవి ప్రస్తుతం వెల్లడైన లక్ష్య పనితీరు వివరాలు మాత్రమే. ఫోన్ వాస్తవ వినియోగంలో ఎంత స్థిరమైన పనితీరును అందిస్తుంది.
100W ఫాస్ట్ ఛార్జింగ్
ఈ మొబైల్ ఇప్పటికే చైనాలో 3C సర్టిఫికేషన్‌ను పొందింది. PYB110 మోడల్ నంబర్‌తో కనిపించిన ఈ సర్టిఫికేషన్ ప్రకారం ఫోన్‌లో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివర్లో అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీకి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ ఈ వారం తెలపనుంది.

