Site icon NTV Telugu

OnePlus 11R 5G: అదిరిపోయే ఫీచర్స్‌తో వన్ ప్లస్ 11R 5G మొబైల్ లాంచ్

Qq

Qq

వన్‍ప్లస్ 11ఆర్ 5జీ మొబైల్ ఇండియాలో లాంచ్ అయింది. క్లౌడ్ 11 ఈవెంట్‌లో వన్‌ప్లస్ 11 5జీతో పాటు ఈ ఫోన్ కూడా అడుగుపెట్టింది. కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‍ప్లే, స్నాప్‍డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో ప్రీమియమ్ మిడ్ రేంజ్‍లో వన్‍ప్లస్ 11ఆర్ 5జీ విడుదలైంది. 50 మెగాపిక్సెల్ ఫ్లాగ్‍షిప్ కెమెరా కలిగిన ఈ మొబైల్ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఫీచర్స్ ఇవే..

6.74 ఇంచుల Full HD+ కర్వ్డ్ అమోలెడ్ డిస్‍ప్లేతో వన్‍ప్లస్ 11ఆర్ 5జీ వస్తోంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 పీక్ బ్రైట్‍నెస్, హెచ్‍డీఆర్ సపోర్ట్ ఉంటాయి. స్నాప్‍డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13.0 ఆపరేటింగ్ సిస్టమ్‍ ఇందులో ఉంది. వన్‍ప్లస్ 11ఆర్ 5జీ కెమెరా విషయానికి వస్తే.. వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా అప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను పొందుపర్చారు.

Also Read: Rishabh Pant: ‘పంత్.. నిన్ను కొట్టేస్తా’: మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్

అలాగే వన్‍ప్లస్ 11ఆర్ ఫోన్‍లో 5000mAh బ్యాటరీ ఉండగా.. 100 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్‍ఎఫ్‍సీ, జీపీఎస్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. ఇన్‍ డిస్‍ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది. ఇన్ని అద్భుత ఫీచర్లు పొందుపర్చిన వన్‍ప్లస్ 11ఆర్ 5జీ 8జీబీ ర్యామ్ + 128జీబీ ఫోన్ ధర రూ.39,999గా ఉంది. 16జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ రూ.44,999 ధరతో మార్కెట్లోకి రాబోతుది. సోనిక్ బ్లాక్, గలాటిక్ సిల్వర్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఈనెల 28వ తేదీన వన్‍ప్లస్ వెబ్‍సైట్, అమెజాన్, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది. ఈనెల 21వ తేదీన ప్రీ-ఆర్డర్లు మొదలవుతాయి.

Also Read: INDvsAUS 1st Test: రవిశాస్త్రి ఫైనల్ ఎలెవన్ ఇదే..ఓపెనర్లుగా వీరే!

Exit mobile version