Site icon NTV Telugu

Jeelugu Kallu: జీలుగు కల్లు తాగిన గిరిజనులు.. ఒకరి మృతి

Bapatla Volunteer Died

Bapatla Volunteer Died

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది…జీలుగు కల్లు తాగిన నలుగురు గిరిజన యువకులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అందులో కొందరికి వాంతులు అయ్యి తీవ్ర అస్వస్థతత కు గురయ్యరు..వారిని అల్లూరి జిల్లా జికె వీధి మండలం సప్పర్ల ప్రభుత్వ హస్పటల్ లో చేర్పించి చికిత్స అందించారు… అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా పాంగి లోవరాజు (25) అనే యువకుడు మృతి చెందాడు..విషమంగా ఉన్న పొంగి రామదాసును నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

అయితే తాగింది జీలుగు కల్లు లేదా ఇంకేదైనా అన్న దానిపై స్పష్టత లేదని వైద్యులు తెలిపారు. నిషా ఇచ్చే ఆరోగ్య కరమైన జీలుగు కల్లు. ఈ కల్లును జీలుగు చెట్టు నుంచి తీస్తారు. టూరిస్టులు సైతం పోటీ పడి మరీ లొట్టలు వేసుకుంటూ తాగేందుకు అక్కడ క్యూ కడతారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం మంచి టూరిస్ట్‌ స్పాట్‌. ఏడాది అంతా పర్యాటకులు వెళ్తూనే ఉంటారు. మన్యంలో దొరికే రకరకాల ఫుడ్‌ వెరైటీస్‌ను ట్రై చేస్తుంటారు.

Read Also: Google Bard: చాట్‌జీపీటీకి షాక్..గూగుల్ ‘బార్డ్’ వచ్చేస్తోంది

అలాగే మన్యంలో మాత్రమే దొరికే అసలు సిసలైన జీలుగు కల్లును తాగేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలా పర్యాటకులకు జీలుగు కల్లు అమ్ముతూ గిరిజనులు ఆదాయం పొందుతుంటారు. కల్లులో ఉండే గుణాలు కడుపుని క్లీన్ చేస్తాయని, అందుకే నగరవాసులు ఏడాదిలో ఒక్కసారైనా ఈ జీలుగు కల్లు తాగాలని అంటారు. పబ్‌లు, బార్‌లో తాగే మత్తు పానీయాలు, వైన్ , బ్రాందీ, విస్కీ.. ఇలాంటివి ఆరోగ్యానికి ఎంతో హానికరం…కానీ ఈ ట్రైబల్‌ ట్రెడిషినల్‌ వైన్‌ సేవిస్తే ఆరోగ్యం అని చెప్తున్నారు. అయితే, తాగింది జీలు కల్లు కాకుంటే అనారోగ్యం పాలవుతారని గిరిజనులు తెలిపారు.

Read Also: WPL 2023: విమెన్స్ లీగ్ ప్రారంభం ఆరోజే..ఐపీఎల్ ఛైర్మన్ ప్రకటన

Exit mobile version