Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ సైన్యంలో మూడో వంతు ముస్లింలే.. నమ్మశక్యంకాని నిజాలు!
- రేపు శివాజీ జయంతి
- హిందూమతాన్ని రక్షించిన మరాఠా యోధుడు
- హిందూ మత సంరక్షణకు కంకణం
- స్వశక్తితో మరాఠా సామ్రాజ్య స్థాపన
- చరిత్రకు తెలియని నమ్మశక్యంగాని నిజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు వింటే హిందూ యువతకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మెఘలుల దాడుల నుంచి హిందూమతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. తల్లి సంరక్షణలో బైరంఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీజపుర, గోల్కొండ సుల్తానులు, మొఘలులకు ముచ్చెమటలు పట్టించాడు. తన గురువు సమర్ధ రామదాసు, తల్లి జిజియాబాయి బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు శివాజీ. స్వశక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ గురించి చరిత్రకు తెలియని నమ్మశక్యంగాని నిజాలు ఎన్నో ఉన్నాయి. రేపు ఈ మహానుభావుడి జయంతి.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
సైన్యంలోని మూడో వంతు మంది ముస్లింలే..
శివాజీ ముస్లింలకు వ్యతిరేకం అని చాలా మంది అనుకుంటారు. కానీ.. అది వాస్తవం కాదు.. ప్రతాప్ఘడ్లోని అఫ్జల్ఖాన్ సమాధిని కూలగొట్టేందుకు హిందూ కార్యకర్తలు గతంలో ప్రయత్నించారు. అయితే, శివాజీనే స్వయంగా దాన్ని నిర్మించాడన్న విషయం వెలుగులోకి రావడంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అన్ని మతాలను గౌరవించిన రాజుల్లో శివాజీ ఒకరు. తన హయాంలోని సైన్యం, పరిపాలన, వివిధ శాఖల్లోని ఉద్యోగుల కూర్పు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. మతం ప్రతిపాదికన కాకుండా మానవీయ విధానాలతో శివాజీ పరిపాలన సాగించాడు. సైన్యం, అధికారుల నియామకాల్లో మతాన్ని ప్రతిపాదికగా తీసుకోలేదు. అతని సైన్యంలోని మూడో వంతు మంది ముస్లింలే. శివాజీ నావికా దళ అధిపతి సిద్ధీ సంబాల్. అందులో ఎక్కువ మంది సైనికులు కూడా ముస్లింలే.
Also Read
- Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
- Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
ఇతర మతాలపై గౌరవం…
ఇతర మతాల పెద్దలను శివాజీ గౌరవించేవాడు. హజ్రత్ బాబా యాకుత్ బహుత్ తొర్వాలే పట్ల శివాజీకి చాలా గౌరవభావం ఉండేది. ఆయనకు జీవితాంతం పింఛను అందేలా ఏర్పాటు చేశాడు. అలాగే ఫాదర్ అంబోస్ పట్ల కూడా ఆయనకు అదే విధమైన గౌరవం ఉండేది. గుజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చి పునర్ నిర్మాణానికి శివాజీ సాయం అందించాడు. తన రాజధాని రాయగఢ్లో ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా మసీదు నిర్మించాడు. యుద్ధ సమయంలో చేతికి చిక్కే ముస్లిం మహిళలు, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని తన సైన్యానికి శివాజీ ఆదేశాలిచ్చాడు. అలాగే, తన రాజ్యంలోని మసీదులు, దర్గాలకు రక్షణ కల్పించాడు. ఎవరికైనా ఖురాన్ దొరికితే దాన్ని చాలా గౌరవంగా తీసుకొని ముస్లింలకు అప్పగించాలని సైనికులను కోరారు. బసేన్ నవాబ్ కోడలి పట్ల శివాజీ చూపిన గౌరవం అందరికి తెలిసిందే. దోపిడీలో భాగంగా ఆమెను సైనికులు శివాజీకి అర్పించేందుకు ప్రయత్నించారు. అప్పుడు శివాజీ ఆమెను ఎంతో గౌరవంగా చూసి క్షమించాలని కోరాడు. అలాగే ఆమెను ఇంటి వరకూ సురక్షితంగా దిగబెట్టిరావాలని తన సైనికులను ఆదేశించాడు.
అఫ్జల్ ఖాన్ను చంపిన శివాజీ..
అఫ్జల్ ఖాన్ను శివాజీ హత్య చేయడాన్ని చరిత్ర వక్రీకరించి చూపింది. అదిల్షా రాజులకు, శివాజీకి ఏళ్ల తరబడి యుద్ధం కొనసాగుతోంది. అఫ్జల్ ఖాన్ అదిల్షా రాజ్యానికి ప్రతినిధిగా శివాజీతో పోరాడాడు. చర్చల పేరుతో శివాజీని తన గుడారానికి ఆహ్వానించి చంపడానికి అఫ్జల్ ఖాన్ కుట్ర పన్నాడు. అయితే, ఈ విషయం కూడా ఒక ముస్లిం ద్వారానే శివాజీకి తెలిసింది. రస్తీం జమాన్ సూచన మేరకే శివాజీ ఇనుప పంజాలు ధరించి అఫ్జల్ ఖాన్ను వధించాడు. శివాజీని కుట్రతో చంపాలని అఫ్జల్ ఖాన్కు సూచించింది హిందూ అయిన కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి. కానీ, ఈ విషయం పెద్దగా వెలుగు చూడలేదు.
రాజుల మధ్య జరిగిన యుద్ధాన్ని మత ఘర్షణలుగా.. బ్రిటిష్ కాలంలో మొదలైన చరిత్ర రచన.. రాజుల మధ్య జరిగిన యుద్ధాన్ని హిందూ, ముస్లింల మధ్య మత గొడవలుగా చిత్రీకరించింది. రాజకీయ ఉద్దేశాలతోనే శివాజీని ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరించారు. చాలా చరిత్ర పుస్తకాలు కూడా అదే ధోరణిలో వచ్చాయి. ప్రసిద్ధ మరాఠా నాటక రచయిత పురంధరే రాసిన ‘జాణ్తా రాజా’ (జగమెరిగిన రాజు) నాటకం మహారాష్ట్ర అంతటా పేరొందింది. ఈ నాటకం శివాజీని ముస్లిం ద్వేషిగా చిత్రీకరించింది. ‘న్యూ హిస్టరీ ఆఫ్ మరాఠాస్’ పుస్తకంలో చరిత్రకారుడు సర్దేశాయి, శివాజీ గురించి రాస్తూ, ‘ముస్లింల పట్ల, వారి మతం పట్ల శివాజీ ఎప్పుడూ ద్వేష భావం చూపలేదు’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!