One Plus Launching 10T Smart Phone On August 3rd.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ వినియోగదారులను ఆకర్షించేందుకు మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ముందుకు రానుంది. వన్‌ప్లస్ 10టీ ఆగస్ట్ 3న భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా లాంఛ్‌కానుంది. వన్‌ప్లస్ ఫోన్లలో తొలిసారిగా వన్‌ప్లస్ 10టీ 16జీబీ ర్యాంతో వినియోగదారులకు ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. వన్‌ప్లస్ ఫోన్‌లు 256జీబీ స్టోరేజ్‌తో మనం చూసినా 16జీబీ ర్యాంతో మాత్రం అందుబాటులో లేవు. వినియోగదారులకు మల్టీటాస్కింగ్ అనుభూతిని అందించేందుకు వన్‌ప్లస్ 10టీ ని రంగంలోకి దింపినట్లు కంపెనీ వెల్లడించింది. రాబోయే వన్‌ప్లస్ 10టీ సెంటర్ అలైన్డ్ పంచ్ హోల్‌తో పాటు, 369 డిగ్రీ యాంటెన్నా సిస్టమ్‌ను కలిగిఉంది.
స్మార్ట్‌ఫోన్ ముందుభాగంలో పంచ్ హోల్ డిజైన్‌తో పాటు సెల్ఫీలు తీసుకునేందుకు, వీడియో కాల్స్ చేసేందుకు సింగిల్ కెమెరాతో పాటు లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+జెన్ 1 ప్రాససర్‌తో గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లతో రానుంది. వెనుక భాగంలో ఫోన్‌లో ఓఐఎస్ సపోర్ట్‌తో ప్రైమరీ 50ఎంవీ సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్‌ను ఉండటం విశేషం. ఇక ఇక వన్‌ప్లస్ లేటెస్ట్ ఫోన్ ఆక్సిజన్ఓఎస్ 12 అవుటాఫ్ ది బాక్స్ ధరకు లభిస్తుంది. వన్‌ప్లస్ 10టీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ 49,999 నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది. 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, టూ మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరాలున్నాయి. ఇక 150డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే వెసులుబాటు లభిస్తుంది. అయితే ఈ ఫోన్ లాంఛ్ తరువాత ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లలో అందుబాటులోకి వస్తుందని సమాచారం.