Site icon NTV Telugu

Mulugu Maoists: విషాదం.. పోలీసుల కోసం అమర్చిన బాంబు పేలడంతో..

Mulugu Moisedt

Mulugu Moisedt

Mulugu Maoists: ములుగు జిల్లాలో విషాదం జరిగింది. పోలీసుల కోసం మావోయిస్టులు అమర్చిన బాంబులో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వాజేడు మండలం కొంగాల గ్రామంలో ఐదుగురు వ్యక్తులు కట్టెలు కొట్టేందుకు అడవిలోకి వెళ్లారు. రోజూ పనిలో భాగమై వారు మాట్లాడుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద సబ్దం వచ్చింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఏసు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతావారు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఏసు ఇల్లందుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే అక్కడ బాంబును అమర్చింది అమాయక వ్యక్తుల కోసం కాదని పోలీసుల కోసం బాంబు అమర్చారని తేలించి.

Read also: Supreme Court: పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

స్థానిక సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఏసు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఐదుగురు నడుచేకుంటూ వెళుతున్న క్రమంలో బాంబుపై ఏసు కాలుపెట్టాడు. అనంతరం కాలు పక్కకు తీయడంతో బాంబు పేలింది. దీంతో ఏసు ఎగిరి కొండపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో పలువురు మావోయిస్టులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు. దాడికి కూడా మావోయిస్టులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల నిఘాను పసిగట్టిన మావోయిస్టులు పలు చోట్ల బాంబులు అమర్చారు.
MLC Kavitha: నేడు కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..

Exit mobile version