NTV Telugu Site icon

Trending Video: మృగరాజు మరణాన్ని శాసించిన దున్నపోతు.. వైరల్ వీడియో..

Viral Video Lion Died

Viral Video Lion Died

సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నోరకాల వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అందులో ఎక్కువగా నవ్వు తెప్పించే వీడియోలు ఉండగా.. మరికొన్ని వేరు వేరు కేటగిరీల సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఒక్కోసారి జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా ఓ సింహం, దున్నపోతు సంబంధించిన భీకర పోరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వైరల్ గా మారిన ఈ వీడియో సంబంధించిన విశేషాలు చూస్తే..

Treatment With Torch Lighting: విద్యుత్ నిలిచిపోవడంతో ఫోన్ లైట్స్ తో రోగులకు చికిత్స..

ప్రతిరోజు కాలం ఒకేలా ఉండదు. ప్రతిరోజు విజయం మనది కాకపోవచ్చు. ఎదుటివాడికి కూడా ఓ రోజు వస్తుందని విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. అచ్చం అలాంటి సంఘటన తాజాగా ఓ అడవిలో జరిగింది. ఓ సోషల్ మీడియా యూజర్ షేర్ చేసిన వీడియోలో అడవి దున్న సింహంను భీకరంగా పోరాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో కనిపిస్తున్న దాన్ని బట్టి చూస్తే ముందుగా సింహం దున్నపోతును వేటాడేందుకు ప్రయత్నం చేసింది. అయితే ఈ భీకర పోరులో దున్నపోతు చాకచక్యంగా తన పదునైన కొమ్ములతో సింహాన్ని ఓ రేంజ్ లో ఆటడుకుంది.

West Bengal: యూనిఫాం ధరించలేదని విద్యార్థిని చితకబాదిన హెడ్ మాస్టర్.. పరిస్థితి విషమం
ఈ దెబ్బతో సింహానికి తీవ్రంగా గాయాలయి రక్తం వచ్చింది. ఆయన గాని దున్నపోతు ఎక్కడా వెనక్కి తగ్గకుండా సింహం పై పదేపదే దాడి చేయడంతో చివరికి సింహం ప్రాణాలను వదిలేయాల్సి వచ్చింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 1. 5 మిలియన్ వ్యూస్ రాగా వేల సంఖ్యలో లైక్స్ సంపాదించింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ని ఒకసారి వీక్షించండి.