Site icon NTV Telugu

Bad Boys: Ride or Die: ఒక రోజు ముందుగానే రాబోతున్న ‘బ్యాడ్ బాయ్స్’..

Bad Boys

Bad Boys

Bad Boys: Ride or Die : ఒక రోజు ముందుగానే డిటెక్టివ్లు మైక్ లోరీ, మార్కస్ బర్నెట్ యొక్క కొత్త మిషన్ బ్యాడ్ బాయ్స్ భారతదేశానికి వస్తున్న నేపథ్యంలో భారతదేశంలోని హాలీవుడ్ అభిమానులకు ఆనందంగా ఉంది. విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ ద్వయం నటించిన ఓ ప్రముఖ ఫ్రాంచైజీలోని నాల్గవ విడత ఈ సినిమా.. ” బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై”. విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ లు వారి జీవితంలో అతిపెద్ద మిషన్‌ ను మొదలు పెట్టడంతో భారీ అంచనాలను అందుకుంది. భారతదేశం అంతటా భారీ స్థాయిలో ఈ చిత్రం 6 జూన్, 2024న ఒక రోజు ముందే థియేటర్లలోకి రాబోతోంది. ఈ ఆదిల్ & బిలాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వెనెస్సా హడ్జెన్స్, అలెగ్జాండర్ లుడ్విగ్, పావోలా న్యూనెజ్, ఎరిక్ డేన్, ఇయాన్ గ్రుఫుడ్, జాకబ్ స్కిపియో, మెలానీ లిబర్డ్, తాషా స్మిత్‌తో టిఫనీ హడిష్ మరియు జో పాంటోలియానో లాంటి ప్రముఖ బాలీవుడ్ యాక్టర్స్ ఇందులో నటించారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల అవుతుంది ఈ యాక్షన్ ఎంటర్టైనర్.

Nitish Kumar: కనీసం 4 కేబినెట్ బెర్తులు కావాలి, నితీష్ కోరుతున్నది ఈ మంత్రిత్వ శాఖలనేనా.?

నాలుగు రెట్లు యాక్షన్, నాలుగు రెట్లు వినోదాన్ని వాగ్దానం చేస్తూ.. ఈ చిత్రం జూన్ 6వ తేదీన భారతదేశంలో ఒక రోజు ముందుగానే విడుదల కావడంతో భారతీయ అభిమానులు ఆనందించవచ్చు. బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్‌ కి దర్శకత్వం వహించిన ఆదిల్ & బిలాల్ మాట్లాడుతూ.. “మేము 19 సంవత్సరాల వయస్సులో బ్రస్సెల్స్‌ లో ఫిల్మ్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు, మేము ఒక రోజు హాలీవుడ్‌లో భాగం కావాలని కలలు కన్నమని తెలిపాడు. అయితే ఈ సినిమాను మేము జెర్రీ, విల్‌ లను అడిగే వరకు ఇది జరుగుతుందని మేము ఎప్పుడూ నమ్మలేదని.. మేము ఇంకా తమని తాము పించ్ చేస్తున్నాము ని పేర్కొన్నారు. మేము అభిమానులం కాబట్టి ఇది ఇప్పటికీ చాలా అందమైన అనుభూతి అంటూ తెలిపారు.

Affiliate Marketing: ‘అఫిలియేట్ మార్కెటింగ్’ అంటే ఏంటి.. దానిని ఎలా మొదలుపెట్టాలంటే..

ఈ వేసవిలో, ప్రపంచంలోని ఇష్టమైన బ్యాడ్ బాయ్స్ ఎడ్జ్-ఆఫ్-యువర్-సీట్ యాక్షన్, విపరీతమైన కామెడీతో వారి ఐకానిక్ మిక్స్‌తో తిరిగి వచ్చారు. అయితే ఈసారి ఒక ట్విస్ట్‌తో కథ ముడిపడీ ఉంటుందని తెలిపారు. ఆదిల్ & బిలాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెనెస్సా హడ్జెన్స్, అలెగ్జాండర్ లుడ్విగ్, పావోలా న్యూనెజ్, ఎరిక్ డేన్, ఇయాన్ గ్రుఫుడ్, జాకబ్ స్కిపియో, మెలానీ లిబర్డ్, తాషా స్మిత్‌తో టిఫనీ హడిష్, జో పాంటోలియానో ​​కూడా ఉన్నారు.

Exit mobile version