ఒక వైపు మునుగోడులో కోట్ల రూపాయల నగదు పట్టుబడుతుంటే.. ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా నగదు పోలీసులకు చిక్కుతోంది. నార్సింగిలో భారీగా నగదు పట్టుబడింది. నార్సింగి రోటరీ వద్ద కోటి రూపాయల నగదు సీజ్ చేశారు పోలీసులు. కోకాపేట నుండి నార్సింగి మీదుగా హైదరాబాద్ వెళుతున్నాయి కొన్ని ఖరీదైన కార్లు. పోలీసులను చూసి కార్ల వేగం పెంచారు డ్రైవర్లు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ కార్లను వెంబడించి పట్టుకున్నారు. కార్లలోని బ్యాగుల్లో ఉన్న కోటి రూపాయల నగదు గుర్తించారు. ఈ కేసుకి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నలుగురు తప్పించుకున్నట్టు తెలుస్తోంది.
కోకాపేట లో ఉండే సునీల్ రెడ్డి వద్ద డబ్బులు తీసుకున్నాడు దేవల్ రాజు అనే వ్యక్తి. వ్యాపారవేత్త హర్షవర్ధన్ అదేశాల మేరకు కోకాపేట లెజెండ్ చిమినీస్ విల్లాలో ఉండే సునీల్ రెడ్డి విల్లాకు చేరుకున్నాడు దేవల్ రాజు. సునీల్ రెడ్డి ఇచ్చిన కోటి రూపాయలను మూడు భాగాలుగా చేసి మూడు కార్లలో దాచిన దేవల్ రాజు దానిని నగరానికి తరలించే ప్రయత్నం చేశాడు. నార్సింగి చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా వారి కళ్లు గప్పి పారిపోయే యత్నం చేశాడు దేవల్ రాజు అండ్ గ్యాంగ్. అనుమానం బాగా పెరగడంతో పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కార్లను వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. ఈ నగదుకు సంబంధించి వారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని తెలుస్తోంది. తప్పించుకున్న నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read ALso: Pawan Kalyan: అక్రమాలకు బయటకు వస్తాయని భయపడి తప్పుడు కేసులు పెట్టారు
ఈ కేసుకి సంబంధించి దేవల్ రాజు, శ్రీకాంత్ సాగర్, గుండాల విజయ్ కుమార్, దేవుల పల్లి నాగేష్, దాసర్ లుతార్ ల అరెస్ట్ చేశారు. పరారీలో హర్షవర్ధన్ రెడ్డి, సునీల్ రెడ్డి, కోమటి రెడ్డి సుమంత్ రెడ్డి, కోమటి రెడ్డి సూర్య పవన్ కుమార్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతికి చెందిన డబ్బులుగా అనుమానిస్తున్నారు పోలీసులు.
Read Also: America: అమెరికాలో దీపావళి.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ నివాసంలో ఘనంగా వేడుకలు
