Site icon NTV Telugu

Raghava Lawrence : మరోసారి మంచి మనసు చాటుకున్న రాఘవ లారెన్స్..

Whatsapp Image 2024 05 01 At 7.49.01 Pm

Whatsapp Image 2024 05 01 At 7.49.01 Pm

కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.డైరెక్టర్ గా ,యాక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా రాఘవ లారెన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు.అలాగే లారెన్స్ సేవా కార్యక్రమాలు చేయడంలోనూ ముందుంటారు .అనాథ బాలలు,దివ్యాంగులు,పేదవారికి సాయం చేస్తూ వుంటారు.అలాగే టాలెంట్ వున్న దివ్యాంగులకు తన సినిమాలో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆపదలో ఆదుకోవడానికి లారెన్స్ ఎప్పుడు ముందు వుంటారు.ఇదిలా ఉంటే లారెన్స్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.నేడు కార్మికుల దినోత్సవం సందర్భంగా తాజాగా లారెన్స్ తన ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేస్తూ ‘సేవే దేవుడు’ అంటూ తాను చేయబోయే మరో సేవా కార్యక్రమం గురించి తెలియజేసారు.

లారెన్స్ మాట్లాడుతూ “హాయ్ ఫ్రెండ్స్ మరియు ఫ్యాన్స్, ఈ ప్రత్యేకమైన “కార్మికుల దినోత్సవం” సందర్భంగా, మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా “సేవే దేవుడు”అనే ఈ ప్రత్యేకమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మన దేశానికి వెన్నెముక అయిన రైతుల కోసం మొదటి దశగా 10 ట్రాక్టర్లను నా స్వంత డబ్బుతో అందజేస్తున్నాను. అవసరమైన వ్యక్తులకు ఇలాంటి సేవ చేయడం ఎంతో ఆనందం కలిగిస్తుందని లారెన్స్ తెలిపారు.అలాగే ఈ నిస్వార్థ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ చేరి మాకు మద్దతు ఇవ్వగలరని లారెన్స్ కోరారు.మనం మాట్లాడే మాటల కంటే కూడా మనం చేసే చర్య ఎంతో గట్టిగా మాట్లాడుతుందని లారెన్స్ తెలిపారు. అందుకే, నాకు మీ అందరి మద్దతు మరియు ఆశీస్సులు కావాలని లారెన్స్ కోరారు.ఈ కార్మిక దినోత్సవం నుండే ‘సేవే దేవుడు’ మొదలవుతుంది అంటూ రాఘవ లారెన్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version