ప్రముఖ సంస్థ గూగుల్ గత కొన్ని వారాలుగా వరుసగా ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే వేల మంది ఉద్యోగుల పై వేటు వేసిన గూగుల్ ఇప్పుడు మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది.. ఈ ఏడాదిలో వరుసగా ఉద్యోగులను తొలగిస్తు వస్తున్న సంగతి తెలిసిందే.. కాగా, కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం తన మొత్తం పైథాన్ టీమ్ ను తొలగించినట్లు ఇప్పుడు వెల్లడైంది..
యునైటెడ్ స్టేట్స్ వెలుపల తక్కువ ఖర్చుతో కూడిన ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలనే Google యొక్క ప్రణాళిక కారణంగా మొత్తంటీమ్ తొలగించబడినందున కంపెనీ తన పైథాన్ విభాగంలో ఇటీవలి కోతలను చూసింది.. ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదించింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో కొత్త టీమ్ ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.. తక్కువ జీతంతో పనిచేసే వారిని నియమించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది..
ఇక బెంగళూరు, మెక్సికో సిటీ మరియు డబ్లిన్‌లపై మరింత దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నందున కంపెనీ తన విస్తృత పునర్నిర్మాణ ప్రయత్నాలను కొనసాగిస్తోందని గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పోరాట్ ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా తెలిపారు. గూగుల్ తన ఇంజనీరింగ్, హార్డ్‌వేర్ మరియు అసిస్టెంట్ టీమ్‌లను కలిగి ఉన్న టీమ్ ల నుంచి ఈ ఏడాది జనవరిలో వందల మందిని తొలగించింది.. ఏది ఏమైనా మేనేజర్ తో సహా టీమ్ ను తీసేయ్యడం అన్యాయమని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
