NTV Telugu Site icon

Independence Day: రక్తంతో స్వాతంత్య్ర సమరయోధులకు చిత్రనివాళి అర్పించిన ఆర్టిస్ట్ కోటేష్..

Kotesh Art

Kotesh Art

Independence Day Kotesh Art: ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారిలోనే దేశభక్తిని వ్యక్త పరుస్తుంటారు. ఇందులో భాగంగానే స్వాతంత్ర దినోత్సవం రోజున పునస్కరించుకొని ప్రముఖ చిత్రకళాకారుడు కోటేష్ వేసిన చిత్రం ఇప్పుడు అందర్నీ అబ్బురపరుస్తుంది. దాదాపు 240 మంది సమరయోధుల ముఖాలను చిత్రకారుడు కోటేష్ తన రక్తంతో A 3 డ్రాయింగ్ షీట్ పై ఐదు గంటల పాటు శ్రమించి ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ వినూత్నమైన రీతిలో స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను చిత్రీకరించి తన దేశభక్తిని చాటారు. ప్రస్తుతం ఈ ఆర్ట్ ను చూసిన వారందరూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

CM Revanth Reddy: ఆడబిడ్డల కోసం మహాలక్ష్మీ పథకంలోని మరో పథకం 500లకే వంట గ్యాస్..

ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ.. ఎందరో వీరుల త్యాగాల ఫలమే నేటి స్వాతంత్య్ర ఫలం అని తెలిపారు. భారతదేశ కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేసి అమరులైన ఎంతోమంది వీరులు ఎందరో ఉన్నారని.. వారందరూ ఎన్నో అవమానాలు, లాఠీ దెబ్బలు, కఠిన కారాకార శిక్షలు అనుభవించి మనకు స్వాతంత్రం తీసుకు వచ్చారని తెలియజేస్తూ.. వారి ప్రాణ త్యాగాలతో వచ్చిన స్వాతంత్ర దినోత్సవం రోజున తన రక్తంతో వారికి చిత్ర నివాళి అర్పించడం చాలా ఆనందంగా ఉంది అంటూ కోటిష్ తెలిపారు. ఇక చిత్రకారుడు కోటేష్ వేసిన చిత్రంలో దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన యోధులను భరతమాత చూస్తున్నట్లుగా కలాఖండాన్ని సృష్టించారు. ఈ చిత్రంలో స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర ఉద్యమాలలో అనేక ఘటనలను పొందుపరిచారు. ముఖ్యంగా జలియన్ వాలాబాగ్ సంఘటనకు సంబంధించి ఘటన కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.