NTV Telugu Site icon

Om Bheem Bush Twitter Review : ‘ఓం భీం బుష్’ కామెడీ అదిరిపోయిందిగా.. సినిమా ఎలా ఉందంటే?

Om Bheem Bush

Om Bheem Bush

ఈరోజుల్లో జనాలు కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు.. చూసిన కథలను కాకుండా కొత్తగా వచ్చే కథలకు బ్రహ్మరథం పడుతున్నారు… అలాంటి సినిమాలే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.. తాజాగా శ్రీవిష్ణు నటించిన ‘ఓం భీం బుష్ ‘ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది.. మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోతుంది.. విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమాకు హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్, టీజర్స్ కామెడీతో కడుపుబ్బా నవ్వించ్చాయి..

భైరవపురంలోకి బ్యాంగ్ బ్రోస్ ఎంట్రీ ఇచ్చాక ఏం జరిగింది? ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? అక్కడ పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? ఆ గ్రామంలో ఉన్న సంపంగి దెయ్యం ఎవరు? ఇక ఆ దెయ్యంను తరిమెందుకు ఈ ముగ్గురు ఏం చేశారు అనేది సినిమా కథ.. ఇక సినిమా ఎలా ఉంటుందో.. జనాల స్పందన ఏంటో ట్విట్టర్ రివ్యూ లను ఒక్కసారి చూసేద్దాం..

శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ అదిరిపోయింది.. గతంలో వచ్చిన సామజవరగమన సినిమాను మించి ఉంది.. సినిమా సూపర్ హిట్.. కామెడీతో కడుపుబ్బా నవ్వించాడని ఓ యూజర్ రాసుకొచ్చాడు..

లాజిక్‌లు లేని క్రేజీ & హానిచేయని ఎంటర్‌టైనర్. కథ, స్క్రీన్‌ప్లే, క్యారెక్టర్ ఆర్క్‌లు లేవు – ఇది కేవలం పంచ్‌లు, నాన్‌స్టాప్ కామెడీ.. ఇది కొందరిని ఆకట్టుకోవచ్చు మరియు ఇతరులను నిరాశపరచవచ్చు కానీ పెద్ద స్క్రీన్‌లలో చూడటం వలన నష్టమేమీ లేదు! సినిమా సూచనలు, ఆసక్తికరమైన కొత్త కాన్సెప్ట్.. సినిమా మొత్తం నవ్విస్తుంది..

ఈ సినిమా ఫుల్ కామెడీ మూవీ.. ఫ్రెండ్స్ తో సినిమాకు వెళ్తే ఇక నవ్వులే నవ్వులు.. కడుపు చెక్కలవుతుంది.. సమ్మర్ బ్లాక్ బాస్టర్ సినిమా.. తప్పకుండ చూడాల్సిన సినిమా అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు…

ఇలాంటి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ట్వీట్ చేశారు.. ఈ సినిమా మొత్తం ముగ్గురు మీదనే నడుస్తుంది.. సరికొత్త కథగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అలాగే సినిమా రేటింగ్ కూడా బాగానే ఉండంతో జనాలు సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు… మొత్తానికి జనాల స్పందన చూస్తుంటే సినిమా సూపర్ హిట్ అని తెలుస్తుంది.. కలెక్షన్స్ ఏ మాత్రం రాబడుతుందో చూడాలి..

Show comments