ప్రస్తుతం వస్తున్న సినిమాలలో పూర్తి హారర్ టచ్ తో ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాగే హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చే మూవీస్ కు మంచి ఆదరణ లభిస్తుంది .ఇటీవల లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓం భీం బుష్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.బ్రోచెవారెవరురా సినిమాతో సూపర్ హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ఆ సినిమాలో వారి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.దీనితో ఈ ముగ్గురు కాంబినేషన్‌లో మరో మూవీ వచ్చింది .ఆ సినిమానే ఓం భీమ్ బుష్. ఈ ముగ్గురు కలిసి మరోసారి కామెడీతో మ్యాజిక్ చేసారు.ఈ సినిమాకి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనేది క్యాప్షన్ ఉంచడం గమనార్హం.మార్చి 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇందులోని లాజిక్ లేని కామెడీని ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేశారు.
అయితే థియేటర్స్ లో రిలీజైన 20 రోజుల్లోనే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలోకి వచ్చింది.ఏప్రిల్ 12 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.ప్రస్తుతం ఈ తెలుగు హారర్ కామెడీ మూవీ ఓటీటీలో అదరగొడుతుంది .ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ టాప్ ట్రెండింగ్ మూవీస్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.ఒటిటిలోకి వచ్చిన తొలి రోజు నుంచే టాప్ ట్రెండింగ్ లిస్టులోకి వెళ్లిన ఈ సినిమా అలాగే కొనసాగుతోంది.ఓం భీమ్ బుష్ మూవీని దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించారు. ఆయన గతంలో హుషార్ మరియు రౌడీ బాయ్స్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఈ చిత్రం విడుదలకు ముందు నుంచి టీజర్ మరియు ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది .దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది .