Site icon NTV Telugu

Om Bheem Bush: ఉన్నది కాసేపైనా అందాలతో కట్టిపారేసిన హీరోయిన్స్..!

3

3

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతీ ముకుందన్, కామక్షి భాస్కర్ల, ప్రియావడ్లమాని, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి, షాన్ కక్కర్, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా ఓం భీం బుష్. వీ సెల్యులాయిడ్ బ్యానర్ పై, శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన యువి క్రియేషన్స్ సమర్పణలో సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి రాజ్ తోట సినిమాటోగ్రఫి బాధ్యతలు చేపట్టగా.. సన్నీ ఎంఆర్ డీవోపీ మ్యూజిక్ ను చూసుకున్నారు.

Also read: Om Bheem Bush Twitter Review : ‘ఓం భీం బుష్’ కామెడీ అదిరిపోయిందిగా.. సినిమా ఎలా ఉందంటే?

ఇక ఈ సినిమా విషయానికి వస్తే పూర్తి కామిడి ఓరియంటెడ్ గా తెరకెక్కినది. ఇక ఈ సినిమాలో మొత్తం నలుగురు హీరోయిన్లు ఉన్నారు. ప్రియదర్శికి జోడిగా అయేషా ఖాన్ నటించగా, శ్రీ విష్ణుకి జోడిగా ప్రీతి ముకుందన్ నటించింది. సినిమాలో మరో హీరోయిన్ ప్రియా వడ్లమాని కూడా ఓ స్పెషల్ సాంగ్ లో కనపడగా., మరో హీరోయిన్ సాయి కామాక్షి భాస్కరాల ఓ స్పెషల్ సీన్ చేసింది. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్ కుమార్తె నేహా శర్మ పాత్రలో నటించింది. చేసింది ఒక్క సీనే అయినా అదికూడా రొమాంటిక్ సీన్.

Also read: Gold Price Today: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

సినిమాలో ఉన్నది కాసేపైనా రంజిత్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ గుర్తుండిపోయేలా నటించారు. ఇక కామాక్షి భాస్కర్ల చిన్న పాత్రైనా కనిపించినంత సేపు గ్లామర్‌ తో మెరుపులు మెరిపించారు. స్పెషల్ సాంగ్‌లో ప్రియా వడ్లమాని అందాల అరబోతతో మాస్ ఆడియెన్స్ ట్రీట్ అందించారు. ఆయేషా ఖాన్, ప్రీతీ ముకుందన్ తమ పాత్రలకు పరిధి మేరకు సినిమాకు యాడ్ అన్ ఫ్యాక్టర్‌ గా మారారు. రచ్చ రవి తనదైన కామెడీతో ఆకట్టుకొన్నాడు. మిగితా పాత్రల్లో నటించిన ప్రతీ ఒక్కరు సినిమాకు సపోర్టుగా నిలిచారు.

Exit mobile version