Site icon NTV Telugu

Viral Video: వామ్మో.. ఆ ఊపుడేంది తాత.. పెళ్లిలో డ్యాన్స్ ఇరగదీసిండు..

Viral Tatha

Viral Tatha

సోషల్ మీడియాలో పెళ్లికి సంబందించిన ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.. కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు మాత్రమే వైరల్ అవ్వడంతో పాటు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.. ముఖ్యంగా వృద్ధులు చేసే డ్యాన్స్ లు జనాలను విపరీతంగా ఆకర్షస్తున్నాయి.. తాజాగా ఓ పెళ్లి లో వృద్ధుడు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది..

వయస్సు మీద పడ్డాక జీవితాన్ని గడపడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. అన్ని సమస్యలు, బాధ్యతలను మోస్తూ ముందుకు సాగడం లేదా జీవితాన్ని సరదాగా గడుపుతూ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళ్లడం అని అంటారు. కొందరు జీవితంలో ఏదైనా చేయగలరు. ఇటీవలి కాలంలో అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది..

ఈ వీడియోలోని ఓ వ్యక్తి పెళ్లి వేడుకలో యువకులతో కలిసి వేదికపై నృత్యం చేయడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. భోజ్‌పురి పాట విన్న వెంటనే వృద్ధుడి లోపల ఉన్న యువకుడు బయటికి వచ్చాడు. ఆపై స్టేజ్ మీద ఉన్న యువకులతో కలిసి ఓ రేంజ్ లో స్టెప్స్ వేశాడు. వృద్ధుడి డ్యాన్స్ ప్రతిభ ముందు యువకుల ప్రదర్శన కూడా దిగదుడుపే అని చెప్పవచ్చు. ప్రదర్శన సమయంలో వృద్ధుడి ముఖంలో చిరునవ్వు చెక్కుచెదరకుండా ఉంది… ఆయనను వద్దు అని ఆపడానికి వచ్చిన కూడా మర్చిపోయి చేసిన తాత డ్యాన్స్ వీడియో వైరల్ అవ్వడంతో చూసి అందరు సంతోషంగా ఫీల్ అవుతున్నారు.. అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..

Exit mobile version