Site icon NTV Telugu

కొత్త వృద్ధాప్య పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం

వృద్ధాప్య పెన్షన్లకు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించిన వయోపరిమితిని అనుసరించి నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తగ్గించిన వయో పరిమితిని అనుసరించి అర్హులైన వాళ్ళు ఈ నెల 31 లోగా ఈ సేవ/మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తక్షణమే ఈ చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్ లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం పుట్టిన తేదీ ధృవీకరణ, ఓటర్ కార్డు తదితర పత్రాలను దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది.

Exit mobile version