NTV Telugu Site icon

Ola S1 Air Pre-Booking: జులై 28 నుంచి ఓలా ఎస్1 ఎయిర్ బుకింగ్స్‌.. వారికి మాత్రం 10వేల డిస్కౌంట్!

Ola S1 Air

Ola S1 Air

Ola S1 Air Electric Scooter Launch, Price and Range: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్‌ ధరలతో విసిగిపోయిన జనాలు ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని పలు దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్, కార్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ‘ఓలా’ కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దూసుకెళుతోంది. తాజాగా మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది.

Ola S1 Air Electric Scooter Launch:
ఓలా ఎలక్ట్రిక్‌ తన ఎస్1 ఎయిర్ స్కూటర్‌ను జులై 28న భారత మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఈ విషయాన్ని ఓలా కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ స్కూటర్ కొనుగోలు విండో (ప్రీ బుకింగ్‌) జూలై 28 నుంచి 30 మధ్యన మాత్రమే ఉంటుంది. ఓలా పాత కస్టమర్లు, ఇంతకుముందే ఓలా ఎస్1 ఎయిర్ కోసం రిజర్వ్‌ చేసుకున్న వారు మాత్రమే ఈ మూడు రోజుల్లో ఈ స్కూటర్‌ కోసం బుక్‌ చేసుకోవచ్చు.

Also Read: Cold And Cough Mistakes: జ్వరం, జలుబు ఉన్నప్పుడు.. ఈ తప్పు అస్సలు చేయవద్దు!

Ola S1 Air Electric Scooter Price:
ఓలా ఎలక్ట్రిక్‌ ఎస్1 ఎయిర్ స్కూటర్‌ ధర రూ.1,19,999 (ఎక్స్ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రీ బుకింగ్‌ నిర్వహించనున్న మూడు రోజుల్లో బుక్‌ చేసుకున్న వారికి రూ.1 0వేల తగ్గింపు ఉంటుంది. అపుడు వారికి రూ.1,09,999కే ఎస్1 ఎయిర్ స్కూటర్‌ లభిస్తుంది. జులై 31 నుంచి ఇతర వినియోగదారులు ఈ స్కూటర్‌ని బుక్‌ చేసుకోవచ్చు. వారికి ధర రూ.1,19,999గా ఉంటుంది. ఆగస్టు నుంచి ఈ స్కూటర్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

Ola S1 Air Electric Scooter Range:
ఎస్1 ఎయిర్ స్కూటర్‌ MoveOS-3 ఫీచర్‌తో వస్తుంది. 2.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు హబ్‌ మౌంటెడ్ మోటర్‌ను ఇది కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌ను ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే.. 100 కిమీ ప్రయాణించొచ్చు. ఇది 9.8 సెకన్లలో 60 kmph వేగాన్ని అందుకుంటుంది. గంటకు 90 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళుతుంది. 4:50 గంటల్లో బ్యాటరీని ఫుల్‌ ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఇందులో ఎకో, నార్మల్‌, స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఇస్తున్నారు. పాసిలెన్‌ వైట్‌, లిక్విడ్ సిల్వర్‌, మిడ్‌నైట్‌ బ్లూ, కోరల్‌ గ్లామ్ రంగుల్లో ఎస్1 ఎయిర్ అందుబాటులో ఉంటుంది.

Also Read: Weight Loss Soups: ఈ వెజిటేబుల్ సూప్ తాగితే.. వారం రోజుల్లో బరువు తగ్గుతారు!