ఈ మధ్యకాలంలో జో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్కసారిగా అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ మాళవిక మనోజ్. ఈ సినిమాలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అలాగే.. జనక అయితే గనక అనే సినిమాతో అభిమానులను అలరించిన హీరో సుహాస్. పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. యువ కథానాయకుడు సుహాస్ తన విభిన్నమైన స్టొరీ సెలక్షన్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ, మరో అందమైన ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు.
READ MORE: CM Chandrababu: స్వచ్ఛాంధ్ర, బీసీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఇదిలా ఉండగా.. సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామా’. హరీశ్ నల్ల నిర్మాత. అనిత హస్సానందాని, అలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అతడికి తొలి సినిమా. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది. తాజాగా.. వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ ఓ అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సుహాస్, మాళవిక మనోజ్‌ల రొమాన్స్‌ను చూపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఈ జంట అందించే ప్రేమకథ భావోద్వేగాలను రేకెత్తించేలా ఉండబోతోందని అర్థమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
READ MORE: Nagar Kurnool: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం.. విద్యార్థులకు మెమోలలో తప్పుగా వచ్చిన ఫోటోలు