ఛత్తీస్గడ్ రాష్ట్రం ముంగేలిలోని పఠారియాలో గోయింద్రా గ్రామానికి చెందిన రాకేష్ కుమార్ ఎన్నో అంచనాలతో సైన్యంలో అగ్నివీరుడుగా చేరాడు. జవాన్ రాకేష్ కుమార్‌ను జైపూర్‌లో నియమించారు. పోస్టింగ్ సమయంలో, అతను కూడా హోలీ సెలవుల్లో ఇంటికి వచ్చాడు. హోలీ సెలవు తర్వాత అతను తన యూనిట్‌కి తిరిగి వచ్చినప్పుడు. అతను కొన్ని రోజులు తన కుటుంబంతో టచ్‌లో ఉన్నాడు. గత నెలలుగా రాకేష్ కుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. రాకేష్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు జైపూర్ అధికారులను సంప్రదించారు. రాకేష్ కుమార్ యూనిట్ నుంచి గోడ దూకి తప్పించుకున్నట్లు జైపూర్ అధికారులు అతని కుటుంబానికి తెలిపారు.
READ MORE: India seizes Pak consignment: చైనా నుంచి పాక్ వెళ్తున్న ప్రమాదకర కెమికల్స్‌ని సీజ్ చేసిన భారత్..
నాసిక్ కేసులో అగ్నివీర్ రాకేష్ కుమార్‌కు సంబంధించిన ఫైల్‌ను కూడా అధికారులు విచారణకు పంపారు. తదుపరి విచారణల కోసం నాసిక్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ముంగేలి ఎస్పీని ఆశ్రయించారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎస్పీ అన్నారు. కొడుకు ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ సందర్భంగా అదనపు పోలీసు సూపరింటెండెంట్ పంకజ్ పటేల్ మాట్లాడుతూ.. ”రాకేష్ కుమార్ నిషాద్ గత నాలుగు నెలలుగా కనిపించడం లేదు. అతని మొబైల్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. అతని యూనిట్ నుంచి కూడా దర్యాప్తు జరుగుతోంది. కుటుంబ సభ్యులు, యూనిట్ వ్యక్తులతో మాట్లాడి పూర్తి సమాచారం రాబడుతున్నాం.” అని పేర్కొన్నారు.