NTV Telugu Site icon

UI Movie : “యూఐ” మూవీకి సంబంధించిన ఆ వార్తలన్నీ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన యూనిట్

Upendra UI Movie Review

Upendra UI Movie Review

UI Movie : కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి తెలియని వారుండరు. ఆయన ఒక్క కన్నడలోనే గాకుండా సౌత్ ఇండియా అంతటా మంచి క్రేజ్ ఉన్న హీరో. ఉపేంద్ర ఒకప్పుడు దర్శకుడిగా శంకర్ ని మించిన సినిమాలు తీశారు. అప్పట్లోనే చాలా అడ్వాన్స్డ్ గా ఆయన సినిమాలు ఉండేవి. అయితే ఉపేంద్ర డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టి కొన్నేళ్లు అయింది. దర్శకుడిగా చివరిగా తొమ్మిదేళ్ల కింద ఉప్పి2 సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మళ్లీ ఇప్పుడు ‘UI’ అనే సినిమాతో దర్శకుడిగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా రిలీజ్ అయిన ‘UI’ మూవీ మంచి కలెక్షన్లను అందుకుని హిట్ గా నిలిచింది.

Read Also:HYDRA : ఆ ఫిర్యాదులపై హైడ్రా ఫోకస్‌.. రంగంలోకి హైడ్రా కమిషనర్‌

తన దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఉపేంద్రలోని క్రియేటివిటినీ ఆవిష్కరించింది. తన మార్క్ క్రేజీ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ కి దిమ్మ తిరిగేలా చేసిన ఈ సినిమా కన్నడ సహా తెలుగు ఆడియెన్స్ ఆదరణ అందుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి పలు రూమర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ సన్ నెక్స్ట్ వారు సొంతం చేసుకున్నట్లు.. అందులో త్వరలోనే సినిమా స్ట్రీమింగ్ అంటూ పలు రూమర్స్ వచ్చాయి. మరి వీటిపై సినిమా నిర్మాణ సంస్థలు క్లారిటీ ఇచ్చాయి. తమ యూఐ సినిమాపై వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ ఓటీటీ వార్తలను ఖండించారు. ఏదైనా సరే తమ నుంచే అఫీషియల్ గా క్లారిటీ వస్తుందని సో అప్పుడు వరకు వేచి ఉండాలని సూచించారు. మరి యూఐ ఓటీటీ పార్టనర్, విడుదల పై క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Read Also:OG Movie : పవన్ కోసం దిగొచ్చిన శింబు.. ఈ సాంగ్ వేరే లెవల్

Show comments