Coromandel Express : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. ట్రాక్‌పై పడ్డ ‘కోరమాండల్’ బోగీలను మరో ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 275 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
Read Also:Viral : భోజనానికి కూర్చోగానే మొదలైన వాన.. సూపర్ ఐడియా వేసిన జనాలు
ఇది ఇలా ఉండగా ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ మహంతి తీవ్రగాయాలతో మృతిచెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో లూప్‌లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో రైలులోని బోగీలు గాల్లో ఎగిరి పక్క ట్రాక్‌పై ఎగిరిపడ్డాయి. అదే సమయంలో వెళ్తున్న బెంగళూరు హౌరా ఎక్స్‌ప్రెస్ ఈ బోగీలను ఢీకొట్టడంతో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఇది దేశంలోనే మూడో అతిపెద్ద రైల్వే ప్రమాదంగా గుర్తించారు. ఈ ప్రమాదంతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. తాజాగా ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనపై రైల్వే బోర్డు సీబీఐకి అప్పగించినట్లు తెలుస్తోంది.
Read Also:Kishan Reddy : లింగాయత్ సమాజ్ డిమాండ్ నెరేవేర్చేందుకు కృషి చేస్తాం
