Site icon NTV Telugu

Odisha Minister: ఒడిశా మంత్రిపై కాల్పులు.. తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలింపు

Odisha Minister

Odisha Minister

Odisha Minister: ఒడిశా ఆరోగ్య మంత్రి నబా దాస్‌పై ఆదివారం ఝార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్‌నగర్ సమీపంలోని గాంధీచౌక్ సమీపంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా అతడిపై కాల్పులు జరపడంతో ఛాతిలో బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స కోసం సమీపంలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం.

వాహనం దిగుతున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. దాడి వెనుక ఉద్దేశాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గోపాలచంద్ర దాస్ అనే ఏఎస్సై సర్వీస్ రివాల్వర్‌తో మంత్రిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం మంత్రిని హైదరాబాద్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రిపై కాల్పుల గురించి తెలిసిన ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ వెంటనే స్పందించారు. ఆయన ఆరోగ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Pakistan: వంతెనపై నుంచి పడిన బస్సు.. మంటలు చెలరేగి 40 మంది మృతి

బీజేడీలో సీనియర్ నేత అయిన నబకిశోర్‌ దాస్‌ ఓ దేవాలయానికి రూ.కోటికిపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మంత్రిపై దాడులు జరగడం పార్టీలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Exit mobile version