Site icon NTV Telugu

Odisha: గోడ దూకి ప్రియురాలి ఇంట్లోకి ప్రవేశించిన ప్రియుడు.. విద్యుత్ షాక్ తగిలి మృతి..

Odisha

Odisha

Odisha: ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ధెంకనాల్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ యువకుడు విద్యుదాఘాతంతో మరణించాడు. మృతుడిని సిమిలియా గ్రామానికి చెందిన బిశ్వజిత్ బెహెరాగా గుర్తించారు. బిశ్వజిత్ తన ప్రియురాలిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్లాడని చెబుతున్నాయి. ఆమె అతన్ని రాత్రికి తన ఇంటికి ఆహ్వానించిందని సమాచారం. ప్రియురాలి ఇంటి గోడ దూకిన యువకుడు విద్యుత్ షాక్‌కు గురై నేలపై పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని దెంకనల్ జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.

READ MORE: PoK Protests: పీఓకేలో అదుపుతప్పిన పరిస్థితి.. అసలు అక్కడ ఏం జరుగుతుంది?

మృతుడి కుటుంబం ఇది హత్య అని ఆరోపిస్తూ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో ఈ విషయం తీవ్రమైన మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి కేసు నంబర్ 403 నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో విద్యుదాఘాతం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే అసలు కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటన 28వ తేదీ రాత్రి జరిగింది. రెండు రోజుల తర్వాత మృతుడి కుటుంబం సదర్ పోలీస్ స్టేషన్‌లో హత్య ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై బాధిత కుటుంబీకులు మాట్లాడుతూ.. ప్రియురాలి కుటుంబీకులు కుట్ర పన్ని అతడిని ఇంటికి రప్పించి చంపారని చెబుతున్నారు.

READ MORE: SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. ఈ ఛార్జీలు పెంపు

Exit mobile version