NTV Telugu Site icon

Dasara: దసరా ఉత్సవాల్లో విషాదం.. నృత్యం చేస్తూ యువకుడు, పాటలు పాడుతూ గాయకుడు మృతి

Singer

Singer

Dasara: ఉత్సాహంగా సాగుతున్న దసరా ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఒడిశాలోని జయపురంలోని జగత్ జనని ఆలయంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి విషాదాంతమైంది. శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ విభావరిలో మురళీ ప్రసాద్ మహాపాత్రా అనే గాయకుడు రెండు పాటలు పాడారు. ఆపై విశ్రాంతి తీసుకుంటూ ఇతర ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు, కళకారులు, శ్రోతలు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి, మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, సబ్ కలెక్టర్ దేవధర ప్రధాన్ తదితరులు హాజరయ్యారు. కోరాపుఠ్ జిల్లాకు చెందిన మురళి ‘ఖోకా భాయ్’గా అందరికీ సుపరిచితం. మురళీ ప్రసాద్ గత కొంతకాలంగా హృద్రోగ సమస్యలతోపాటు మధుమేహంతో బాధపడుతున్నట్టు ఆయన సోదరుడు బిభూతి ప్రసాద్ మహాపాత్రా తెలిపారు.

Read Also: Mrunal Thakur: సూసైడ్ చేసుకుందామనుకున్న.. మృణాల్ ఠాకూర్

కాగా, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్ పట్టణంలో జరిగిన మరో ఘటనలో మనీశ్ నర్జాపీ గర్భా నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడాయనను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు. కుమారుడి మరణవార్త విన్న మనీశ్ తండ్రి సోనిగ్రా ఆసుపత్రిలో కుప్పకూలి మరణించారు. అయితే, వీరి మరణానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు. పోస్టుమార్టం అనంతరం వారి మృతికి కారణం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. దసరా వేడుకల్లో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగడం దురదృష్టకరమని నిర్వాహకులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Jagapathi Babu: ‘రుద్రంగి’లో జగపతి బాబు.. లుక్ అదుర్స్

Show comments