NTV Telugu Site icon

Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఆక్టోపస్ మాక్ డ్రిల్.. లోపాలపై ఆగ్రహం..

Indrakiladri

Indrakiladri

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆలయ అధికారులు పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులతో ఆక్టోపస్ నిర్వహించారు. దుర్గగుడిపై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈ నెల19,20 తారీకుల్లో దుర్గగుడిపై ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భద్రతా చర్యలపై ఆక్టోపస్ టీమ్ వేలెత్తిచూపింది. లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయంలో ఏదైనా ప్రమాదం జరిగితే అటు భక్తులకు గాని, ఇటు సిబ్బందిని గాని హెచ్చరించడానికి సైరాన్ సౌకర్యం లేదని గుర్తించింది. ఆలయంలోకి ప్రవేశించడానికి చుట్టుపక్కల తేలిగ్గా రాకపోకలు సాగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

Also Read:Delhi: ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం.. బయటపడ్డ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు.. షాకైన అధికారులు

గుర్తింపు లేని వ్యక్తులు ఘాట్ రోడ్డు ప్రోటోకాల్ వరకు ద్విచక్ర వాహనాలు కారులు పార్కింగ్ చేస్తున్నారు. ఈ రెండు రోజుల మాక్ డ్రిల్ లో ఆక్టోపస్ బృందం లోపాలు కనుగొన్నది. నామా మాత్రపు చర్యలతోనే విధులు నిర్వహిస్తున్నారు. ఆలయంలోకి తేలిగ్గా ప్రవేశించే మార్గాలపై దృష్టి సారించాలి. ఎవరు పడితే వారు ఆలయంలో ప్రవేశిస్తున్నారని వెల్లడించారు. లగేజీల చెకింగ్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.