Site icon NTV Telugu

Sunny Madala: “ఓ టార్చర్ ప్రేమ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

O Torture Prema

O Torture Prema

Sunny Madala: శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకర్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “ఓ టార్చర్ ప్రేమ”. ఈ చిత్రంలో మాదాల రంగారావుగారి మనవడు సన్నీ మాదాల హీరోగా నటిస్తుండగా, మౌనిక డాకోజు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను, టైటిల్ పోస్టర్‌ని ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ విడుదల చేసారు. అనంతరం పరచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. “మా మాదాల రంగారావు గారి మనవడు, మాదాల రవి కుమారుడు, సన్నీ మాదాల హీరోగా పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం హీరో సన్నీ మాదాల ప్రేమ మార్గంని ఎన్నుకున్నాడు. “ఓ టార్చర్ ప్రేమ” అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం విజయవంతం కావాలి” అని కోరుకున్నారు.

READ ALSO: Elon Musk: లారీ పేజ్‌ను అధిగమించి.. $800 బిలియన్లు దాటిన ఎలాన్ మస్క్ సంపద

అనంతరం దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. “ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ చిత్రం లో నవ్వులు చిందించే సన్నివేశాలతో పాటు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం” అని తెలిపారు. ఈ చిత్రంలో సన్నీ మాదాల, మౌనిక డాకోజు, రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్ వర్మ, విష్ణు ప్రియా, యాదమ్మ రాజు, తదితరులు నటిస్తున్నారు.

READ ALSO: Sharad Pawar: సీఎంపై సీరియస్ అయిన శరద్‌పవార్.. ‘నీకు మాట్లాడే రైట్ ఎక్కడిది?’

Exit mobile version