OMG 2 : తెలుగు లో రీమేక్ కాబోతున్న ఓ మై గాడ్ 2..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంత కాలం నుంచి తెలుగు సినిమా లు హిందీలో రీమేక్ అవుతుండడం చూస్తూనే వున్నాం.సౌత్‌లో భారీ విజయాలను అందుకున్న సినిమా లను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత బాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న ఓ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ కాబోతుంది ఆ చిత్రమే అక్షయ్ కుమార్ నటించిన ‘ఓ మై గాడ్ 2’ మూవీ.ఓ మై గాడ్ మూవీ కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదలైంది. సామాజిక అంశాన్ని అద్భుతంగా చూపించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిన్న పిల్లల్లో లైంగిక విజ్ఞానం అనే సున్నిత కథాంశంతో వచ్చిన ఈ కు అమిత్ రాయ్ దర్శకత్వం వహించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 150 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటించి మెప్పించారు.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ను తెలుగులో రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది. తాజాగా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఓమై గాడ్2 చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధమవుఉన్నట్లు సమాచారం. బడా నిర్మాణ సంస్థ ఈ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.. దీంతో ఇప్పుడు ఈ రీమేక్ లో అక్షయ్ కుమార్ పాత్రలో ఎవరు నటించనున్నారు అనే విషయం పై ఆసక్తి నెలకొంది.సినిమాకు కీలకమైన ఈ పాత్రను తెలుగులో ఎవరు పోషిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఓమై గాడ్ తొలి పార్ట్‌ను తెలుగులో ‘గోపాల గోపాల’ పేరుతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కిషోర్ కుమార్ పార్థసాని తెరకెక్కించిన ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటించగా వెంకటేష్ నాస్తికుడు గా నటించారు. ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సీక్వెల్ చిత్రాన్ని కూడా తెలుగులో రీమేక్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. అయితే శివుడి పాత్రలో ఓ టాప్ హీరో నటించనున్నాడని సమాచారం. ఈ సీక్వెల్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!