Site icon NTV Telugu

NZ vs SA: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. స్టార్ పేసర్లు వచ్చేశారు! బ్యాటర్లకు చుక్కలే

Nz Vs Sa Playing 11

Nz Vs Sa Playing 11

New Zealand have won the toss and have opted to field: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ ఆరంభం కానుంది. టోర్నీలో రెండు బలమైన టీమ్స్ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం కివీస్ ఒక మార్పు చేసింది. లాకీ ఫెర్గూసన్ స్థానంలో టిమ్ సౌథీ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. స్పిన్నర్ షమ్సీ స్థానంలో పేసర్ రబడా ఆడుతున్నాడు.

ఇరు జట్లలో టిమ్ సౌథీ, కాగిసో రబడా కీలక పేసర్లు అన్న విషయం తెలిసిందే. పేస్ సహా స్వింగ్ బౌలింగ్ వేస్తారు. దాంతో బ్యాటర్లకు చుక్కలు తప్పేలా లేవు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి.. ఆ తర్వాత వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. ఒకవేళ న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌లో ఓడితే అఫ్గానిస్థాన్‌ (6), పాకిస్థాన్‌ (6)లో సెమీస్‌ ఆశలను పెంచినట్లవుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే దక్షిణాఫ్రికా సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. రెండు టీమ్స్ పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

Also Read: IND vs SL: ఆ మైదానం మరే ఇతర స్టేడియానికి సాటిరాదు: రోహిత్ శర్మ

తుది జట్లు:
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి.
న్యూజిలాండ్‌: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్.

Exit mobile version