Site icon NTV Telugu

NZ vs BAN: సచిన్‌ రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్‌ బ్యాటర్‌.. దిగ్గజాల వల్ల కూడా కాలే!

Soumya Sarkar

Soumya Sarkar

Soumya Sarkar breaks Sachin Tendulkar’s Record: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 14 ఏళ్ల రికార్డును బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ బద్దలు కొట్టాడు. ఆసియా నుంచి వన్డేలలో న్యూజిలాండ్‌ గడ్డపై అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా సౌమ్య రికార్డుల్లో నిలిచాడు. బుధవారం నెల్సన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సౌమ్య సర్కార్ 151 బంతుల్లో 111.92 స్ట్రైక్ రేట్‌తో 169 పరుగులు చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టడం దిగ్గజాల వల్ల కూడా కాలేదు.

2009లో న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా క్రిస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ 163 పరుగులు చేశాడు. ఆసియా ఖండం నుంచి వన్డేలలో కివీస్‌ గడ్డపై ఇదే అత్యధిక స్కోరు. తాజాగా బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 151 బంతుల్లో 22 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో సౌమ్య 169 పరుగులు చేశాడు. భారీ సెంచరీ బాదిన సౌమ్యపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. న్యూజిలాండ్‌ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Crime News: 10 నిమిషాల సమయం కావాలన్నందుకు.. భార్యను హత్య చేసిన భర్త!

నెల్సన్‌ వేదికగా ముగిసిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఓడిపోయింది. ఈ వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 49.5 ఓవర్లలో 291 పరుగుల ఆలౌట్ అయింది. సౌమ్య సర్కార్‌ సెంచరీ చేయగా ముష్ఫీకర్‌ రహీమ్‌ (45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్‌ 46.2 ఓవర్లలోనే మూడు వికెట్స్ కోల్పోయి 296 రన్స్ చేసి విజయాన్ని అందుకుంది. హెన్రీ నికోల్స్ (95), విల్ యంగ్ (89) రాణించారు.

 

Exit mobile version