NZ vs AUS: చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్.. ప్రపంచంలో ‘ఒకే ఒక్కడు’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nathan Lyon Creates History in WTC: వెల్లింగ్‌టన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఆసీస్ 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆసీస్ విజయంలో స్పిన్నర్ నాథన్ లియోన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో లియోన్ 10 వికెట్స్ పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్స్ పడగొట్టిన లియోన్.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించాడు. సంచలన ప్రదర్శన చేసిన లియోన్.. ఓ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నాథన్ లియోన్ నిలిచాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 10 సార్లు 5 వికెట్ల హాల్ లియోన్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, లియోన్ పేరిట సంయుక్తంగా ఉండేది. యాష్ 9 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. తాజా మ్యాచ్‌తో అశ్విన్ రికార్డును లియోన్ బ్రేక్ చేశాడు. ఇటీవలి కాలంలో లియోన్ మంచి ఫామ్ మీదున్న విషయం తెలిసిందే.
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
Also Read: Road Accident : ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, నలుగురికి సీరియస్
నాలుగో రోజు 111/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌ను నాథన్ లియోన్ దెబ్బకొట్టాడు. స్టార్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (56), టామ్ బ్లండెల్ (0), గ్లెన్ ఫిలిఫ్స్ (1)లను ఔట్ చేసి ఆస్ట్రేలియాను విజయం వైపు నడిపాడు. టీమ్ సౌథీ (7) సహా టామ్ లాథమ్ (8), కేన్ విలియమ్సన్ (9)లను పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ చివరలో స్కాట్ కగ్గెలెజీన్ (26), మ్యాట్ హెన్రీ (14)లు కాసేపు పోరాడినా.. గ్రీన్, హేజిల్‌వుడ్ ఈ ఇద్దరినీ ఔట్ చేసి కివీస్ ఆశలపై నీళ్లు చల్లారు. సెంచరీ హీరో కామెరూన్ గ్రీన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
తాజావార్తలు
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!