Site icon NTV Telugu

Nuvve Kavali : రీ రిలీజ్ కు సిద్దమైన కల్ట్ క్లాసిక్ మూవీ..

Whatsapp Image 2023 08 28 At 10.31.24 Am

Whatsapp Image 2023 08 28 At 10.31.24 Am

తెలుగు చిత్ర పరిశ్రమ లో లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నారు హీరో తరుణ్. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తరువాత హీరో గా మారాడు.తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాల లో హీరోగా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇకపోతే తరుణ్ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో “నువ్వే కావాలి” సినిమా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు విజయ భాస్కర్ తెరకెక్కించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  శ్రీనివాస్ ఈ మూవీ కి కథ మరియు మాటలు అందించాడు. ఈ మూవీ లో తరుణ్ సరసన రీచా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఉషా కిరణ్ మూవీస్ పై రామోజీ రావు,స్రవంతి రవి కిషోర్ నిర్మించారు.2000 వ సంవత్సరం లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా ను 1.5 కోట్ల తో నిర్మించగా దాదాపు 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి అప్పట్లో ట్రెండింగ్ గా నిలిచింది. ఈ సినిమా యూత్ నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా అంతటి ఘన విజయం సాధించడం లో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకు కోటి అందించిన సంగీతం అద్భుతం అని చెప్పాలి. ఈ సినిమా పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.ఇకపోతే ఈ బ్లాక్ బస్టర్ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.. ఈ సినిమాని మరికొన్ని రోజుల్లోనే థియేటర్ లలో 4 కే వర్షన్ తో రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.మరి ఈ కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అయి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version